బ్రిటన్‌కు చెందిన అథ్లెట్ మో ఫరా(Mo Farah).. తన సుదూర పరుగుతో ఎన్నో రికార్డులు, ఘనతలూ సాధించాడు. చివరగా రియో ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలతో పాటు మొత్తంగా నాలుగుసార్లు ఒలింపిక్స్ ఛాంపియన్‌గా నిలిచాడు. కానీ ఈ ఏడాది టోక్యోలో జరగనున్న విశ్వ క్రీడల(Tokyo Olympics)కు కనీసం అర్హత సాధించలేకపోయాడు. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బ్రిటీష్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 27ని.28 సెకండ్ల కనీస అర్హత సమయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి మెగాక్రీడలకు దూరమయ్యాడు.
2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణాలతో సత్తాచాటిన మో ఫరా క్రీడాలోకానికి స్ఫూర్తిగా నిలిచాడు. కానీ బ్రిటీష్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో చివరి మూడున్నర కిలోమీటర్లు చాలా ఇబ్బంది పడిన ఇతడు 27.47.04 సమయంలో తన పరుగును పూర్తి చేశాడు. దీంతో 20 సెకండ్ల వ్యవధిలో ఒలింపిక్స్ అర్హతను కోల్పోయాడు.