తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics:​ ప్రేక్షకుల అనుమతిపై కీలక నిర్ణయం! - టోక్యో ఒలింపిక్స్​

టోక్యో ఒలింపిక్స్​లో ప్రేక్షకుల సంఖ్యపై నిర్ణయం తీసుకుంది ఒలింపిక్ నిర్వాహక కమిటీ. ప్రతి ఈవెంట్​లో స్టేడియం సామర్థ్యంలో 50 శాతం, గరిష్ఠంగా 10వేల మందే ఉండాలని స్పష్టం చేసింది.

tokyo olympics, olympics spectators limit
టోక్యో ఒలింపిక్స్​, ప్రేక్షకుల సంఖ్యపై నిర్వాహక కమిటీ నిర్ణయం

By

Published : Jun 21, 2021, 3:38 PM IST

ఒలింపిక్స్​లో ప్రేక్షకుల అనుమతించే విషయం కీలక నిర్ణయం వెల్లడించింది ఒలింపిక్ నిర్వాహక కమిటీ. వేదిక సామర్థ్యంలో 50 శాతం మంది లేదా ఒక్కో గేమ్​కు గరిష్ఠంగా 10 వేల మందిని స్టేడియంలోకి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పోటీలకు స్థానికులు మాత్రమే హాజరు కానున్నారు. విదేశీ అభిమానులపై ఇప్పటికే ఐఓసీ నిషేధం విధించింది.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ పారాలింపిక్​ కమిటీ, టోక్యో 2020, టోక్యో మెట్రో పాలిటిన్ ప్రభుత్వం, జపాన్ ప్రభుత్వం.. సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్​ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్యార్థులతో పాటు వారి పర్యవేక్షకులను అభిమానుల కింద పరిగణించకూడదని స్పష్టం చేశాయి. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్​ జరగనున్నాయి.

ఇదీ చదవండి:Tokyo Olympics: ఒలింపిక్స్​లో తొలిసారి ఓ ట్రాన్స్​జెండర్

ABOUT THE AUTHOR

...view details