మరో వారం రోజుల్లో ప్రారంభంకానున్న ఒలింపిక్స్‌ను కరోనా మహమ్మారి బెడద వీడట్లేదు. బుధవారం మరోమారు కరోనా కలకలం రేగింది. బ్రెజిల్ ఒలింపిక్ జట్టు బస చేసిన హోటల్‌లో ఏడుగురు సిబ్బంది పాజిటివ్‌గా తేలారు. అయితే హోటల్‌లోని బయో బబుల్‌లో ఉన్న 31 మంది సభ్యుల బ్రెజిల్ బృందంలో ఎవరూ పాజిటివ్‌గా తేలకపోవడంతో ఒలింపిక్స్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు విశ్వ క్రీడలు సమీపిస్తున్నా టోక్యోలో కరోనా అదుపులోకి రావట్లేదు. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1149 కేసులు నమోదయ్యాయి. గత ఆర్నెల్లలో ఇదే అత్యధిక సంఖ్య.
Tokyo Olympics: బ్రెజిల్ జట్టు హోటల్లో కరోనా కలకలం - ఒలింపిక్స్ 2020
టోక్యో ఒలింపిక్స్‌లో బుధవారం మరోమారు కరోనా కలకలం రేపింది. బ్రెజిల్ ఒలింపిక్ జట్టు బస చేసిన హోటల్‌లో ఏడుగురు సిబ్బంది పాజిటివ్‌గా తేలారు. హోటల్లో బయోబబుల్‌లో ఉన్న సభ్యులకు మాత్రం నెగిటివ్‌గా నమోదైంది.
శరణార్థుల జట్టు అధికారికీ..: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) శరణార్థుల జట్టు అధికారికి పాజిటివ్ వచ్చింది. దీంతో శరణార్థుల జట్టు టోక్యో ప్రయాణం కాస్త ఆలస్యం కానుంది. "టోక్యోకు వెళ్లేముందు పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా ఒక అధికారికి పాజిటివ్ వచ్చింది. ఆ అధికారికి కరోనా లక్షణాలేవీ లేవు. మిగతా వాళ్లు నెగటివ్‌గా తేలారు. శరణార్థుల జట్టు టోక్యో ప్రయాణం ఆలస్యం కానుంది. అప్పటి వరకు దోహాలోనే శిక్షణ కొనసాగిస్తారు. ప్రతి రోజూ పరీక్షలు నిర్వహిస్తారు" అని ఐఓసీ తెలిపింది. శరణార్థుల జట్టులో మొత్తం 29 మంది క్రీడాకారులు, 11 మంది అధికారులు ఉన్నారు.
ఇవీ చదవండి:ప్చ్.. ఒలింపిక్స్‌లో ఈ స్టార్ ప్లేయర్స్‌ను చూడలేం!