భారత ప్రముఖ బాక్సర్ అమిత్ పంగాల్(52 కిలోలు).. ప్రపంచ నెం.1 ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఇలానే టోక్యో ఒలింపిక్స్‌లో బరిలో దిగనున్నాడు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి చెందిన బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ విడుదల చేసిన తాజా ర్యాంక్సింగ్స్‌లో అమిత్ అగ్ర స్థానానికి ఎగబాకాడు. పురుషుల ర్యాంకింగ్స్‌లో మనీష్ కౌశిక్(63 కిలోలు) 18వ స్థానంలో.. సతీష్ కుమార్(75, 95 కిలోలు) తొమ్మిదో స్థానంలో నిలిచారు.
గత నెలలో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత బాక్సర్ అమిత్ పంగాల్(52 కిలోలు).. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన షాఖోబిదిన్ జోయిరోవ్ చేతిలో 2-3 తేడాతో ఓడిపోయాడు.
ఏడోస్థానంలో మేరీ కోమ్..