తెలంగాణ

telangana

ETV Bharat / sports

ద్యుతీ జాతీయ రికార్డు.. ఐనా దక్కని టోక్యో బెర్త్​ - తజిందర్ పాల్ సింగ్ రికార్డు

పాటియాల వేదికగా జరుగుతోన్న జాతీయ అథ్లెటిక్స్​ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో భారత స్ప్రింటర్​ ద్యుతీ చంద్(Dutee Chand)​ సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయినప్పటికీ ఒలింపిక్స్​కు అర్హత సాధించే అవకాశాన్ని కొద్ది తేడాతో కోల్పోయింది. ​

tokyo olympics, dutee chand
టోక్యో ఒలింపిక్స్, ద్యుతీ చంద్

By

Published : Jun 21, 2021, 9:48 PM IST

భారత స్ప్రింటర్​ ద్యుతీ చంద్(Dutee Chand)​ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒలింపిక్స్ అర్హత టోర్నీలో భాగంగా పాటియాలా వేదికగా జరుగుతోన్న జాతీయ అథ్లెటిక్స్​ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో 11.17 సెకండ్లలోనే 100మీ. పరుగును పూర్తి చేసింది. గతంలో ఆమె పేరిటే ఉన్న రికార్డును తాజాగా అధిగమించింది ద్యుతీ. 11.15 సెకన్లలో పరుగును పూర్తి చేస్తే టోక్యోకు అర్హత సాధించేది ఈ స్ప్రింటర్​. కానీ, కొద్ది తేడాతో ఈ అవకాశాన్ని కోల్పోయింది.

భారత షాట్​పుట్​ ఆటగాడు తజిందర్​ పాల్ సింగ్ ఒలింపిక్స్​కు క్వాలిఫై అయ్యాడు. ఈ క్రమంలో అతడి సొంత రికార్డును బద్దలుకొట్టాడు​. మొదటి సారి 21.49 మీ. దూరం విసిరిన అతడు.. రెండో పర్యాయంలో 21.28 మీ. దూరానికి విసిరాడు. భారత డిస్కస్ త్రో ప్లేయర్​ కమల్​ప్రీత్​ కౌర్.. తన జాతీయ రికార్డును మెరుగుపరుచుకుంది. గతంలో 65.06 మీ. దూరం డిస్కస్​ విసిరిన కౌర్​.. తాజాగా 65.59 మీ. దూరం విసిరింది. ​

ఇదీ చదవండి:వ్యాక్సిన్​ తీసుకుంటేనే ప్రపంచకప్​కు అనుమతి

ABOUT THE AUTHOR

...view details