తెలంగాణ

telangana

ETV Bharat / sports

కలపతో చేసిన టోక్యో ఒలింపిక్స్​ వేదిక అదరహో​ - Japanese architect Kengo Kuma

టోక్యోలో వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్​కు అప్పుడే వేదికలు సిద్ధమైపోతున్నాయి. వీటిలో భాగంగానే మంగళవారం ఓ మైదానానికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది జపాన్​ ప్రభుత్వం. దీనిని 188 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు.

కలపతో చేసిన టోక్యో ఒలింపిక్స్​ వేదిక అదిరెన్​..!

By

Published : Oct 30, 2019, 7:12 AM IST

టోక్యో ఒలింపిక్స్​-2020కు సంబంధించిన వేదికల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. 188 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఓ జిమ్నాస్టిక్​ వేదికనుజపాన్​ ప్రభుత్వం.. మంగళవారం ఆవిష్కరించింది. సంప్రదాయ పద్ధతుల్లో ఈ వేదికను కలపతోనే నిర్మించింది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కలపను సేకరించింది.

కలపతో అద్బుతంగా రూపొందిన బాహ్య గోడ డిజైన్​
పూర్తిగా కలపతోనే వేదిక సిద్ధం

టోక్యోలోని అరియకే జిమ్నాస్టిక్స్​ సెంటర్​ వద్ద 2,300 క్యూబిక్​ మీటర్ల కలపతో ఈ వేదికను నిర్మించారు. జపాన్​ సంప్రదాయ పద్ధతుల్లో దీనిని రూపొందించాడు ప్రముఖ ఆర్కిటెక్ట్​​ కెంగో కుమా. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా వేదికను నిర్మించాడు. ఎత్తయిన పైభాగం కోసం సిడార్(దేవదారు)​ కలపను వినియోగించాడు. ఇక్కడి 12వేల మంది కూర్చునే వీలుంది.

12వేల మంది కూర్చునే జిమ్నాస్టిక్​ వేదిక
చెక్కతో చేసిన బల్లలు

ఒలింపిక్​ స్టేడియం ప్రధాన ద్వారం చూడగానే మైమరిచిపోయేలా రూపొందించారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రదేశంలో ఈ మైదానాన్ని నిర్మించారు. ఒలింపిక్​ క్రీడలు అయిపోగానే దాన్ని ఎగ్జిబిషన్​ సెంటర్​గా మార్చనున్నారు.

ABOUT THE AUTHOR

...view details