తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: ఆ ఘనతంతా వారిదే: ద్యుతిచంద్​ - భారత స్ప్రింటర్​ ద్యుతి చంద్ ఒలింపిక్స్​ బెర్త్​

ఒలింపిక్స్​కు అర్హత సాధించడంపై అథ్లెట్​​ ద్యుతి చంద్(Dutee chand) ఆనందం వ్యక్తం చేసింది. ఇందులో తాను సాధించే విజయం.. సాయ్​, కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజుకు అంకితమని చెప్పింది.

dutee chand
ద్యుతి చంద్​

By

Published : Jul 4, 2021, 5:09 PM IST

టోక్యో​ ఒలింపిక్స్​కు(Tokyo Olympics) అర్హత సాధించడంపై భారత స్టార్ స్ప్రింటర్​ ద్యుతి చంద్(Dutee chand) హర్షం వ్యక్తం చేసింది. మెగాక్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసి సెమీఫైనల్స్​కు చేరుకోవడమే తన లక్ష్యమని తెలిపింది. ఇందుకోసం రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు ప్రాక్టీస్​ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఘనత సాధించడంపై తన శిక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఒలింపిక్స్​లో విజయం సాధిస్తే ఆ ఘనతంతా సాయ్​, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు చెందుతుందని చెప్పింది.

ప్రపంచ ర్యాంకింగ్స్ కోటాలో 100 మీ, 200 మీటర్ల విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్​ కోటాలో బెర్త్​ ఖాయం చేసుకుంది ద్యుతి. ఒలింపిక్స్​లో 100 మీ. పోటీల్లో 22 ఖాళీలు ఉండగా, 200 మీ. పరుగు పందెంలో 15 ఖాళీలు ఉన్నాయి. 100 మీ. విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్​లో 44వ స్థానంలో ఉన్న ద్యుతీ.. 200 మీ. విభాగంలో 51వ స్థానంలో నిలిచింది.

ఇదీ చూడండి: Olympics: స్ప్రింటర్​ ద్యుతీ చంద్​కు ఒలింపిక్స్​ బెర్త్​

ABOUT THE AUTHOR

...view details