తెలంగాణ

telangana

ETV Bharat / sports

టైమ్​ 'అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా స్టార్​ ఫుట్​బాలర్ -​ ఆ ఇద్దరి దిగ్గజాల సరసన మెస్సీ - లియోనల్​ మెస్సీ టైమ్ అథ్లెట్​ ఆఫ్​ ద ఇయర్

Time Magazine Athlete Of The Year 2023 : అర్జెంటీనా స్టార్ ఫుట్​బాలర్ లియోనల్ మెస్సీ తాజాగా ఓ అరుదైన అవార్డును అందుకున్నాడు. ప్రముఖ టైమ్‌ మ్యాగజైన్​ అతడ్ని ఈ ఏడాది అత్యుత్తమ అథ్లెట్‌గా ప్రకటించింది. తమ ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.

Time Magazine Athlete Of The Year 2023
Time Magazine Athlete Of The Year 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 12:38 PM IST

Time Magazine Athlete Of The Year 2023 : అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ప్లేయర్, సాకర్​ స్టార్​​ లియోనల్‌ మెస్సీ తాజాగా తన కెరీర్​లో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. ప్రముఖ టైమ్ మ్యాగజైన్​ 'అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా ఎంపికయ్యాడు. ఈ బిరుదును మెస్సీకి ఇవ్వనున్నట్లు టైమ్ తమ ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. "గతంలో అసాధ్యంగా కనిపించిన వాటిని ఈ ఏడాది మెస్సీ సుసాధ్యం చేసి చూపించాడు. అతడు ఇంటర్‌ మియామి జట్టుకు సైన్​ చేసి చేసి అమెరికాను ఏకంగా సాకర్‌ దేశంగా మార్చేశాడు" అంటూ మెస్సీని కొనియాడింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ మెస్సీకి కంగ్రాజ్యూలేషన్స్​ తెలుపుతున్నారు.

మెస్సీ రాకతో ఎంఎల్‌ఎస్‌ టోర్నీకి వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని టైమ్‌ సంస్థ తెలిపింది. దీంతోపాటు టికెట్‌ ధరలు, విక్రయాలు కూడా బాగా పెరిగాయంటూ పేర్కొంది. ఈ క్రమంలో గతంలో టైమ్‌ నుంచి ఈ అవార్డు అందుకొన్న మైకెల్‌ ఫెల్ప్స్‌ (స్విమ్మింగ్‌), సిమోన్‌ బైల్స్‌ (జిమ్నాస్టిక్స్‌) వంటి వారి దిగ్గజాల సరసన మెస్సీ చేరాడు.

Lionel Messi Miami Club : ఇక మెస్సీ కెరీర్ విషయానికి వస్తే.. గతంలో పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ స్టార్ ప్లేయర్​ ఆ కాంట్రాక్టు ముగిసిన తర్వాత తన హోమ్​ ప్లేస్​ లాంటి బార్సిలోనా క్లబ్‌లో తిరిగి రావాలనుకున్నాడు. కానీ ఆ అవకాశం రాలేదు. దీంతో మియామి లేదా సౌదీ లీగ్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. అలా తాజాగా మియామి క్లబ్​లోకి మెస్సీ ఎంట్రీ ఇచ్చాడు. మెస్సీతో మియామి 20 మిలియన్‌ డాలర్లకు ఒప్పందం చేసుకొంది.

Lionel Messi Ballon D or Award : మరోవైపు తాజాగా ఎనిమిదో సారి 'బాలన్‌ డి ఓర్‌' అవార్డును కూడా మెస్సీ దక్కించుకున్నాడు. 2022-23 గానూ ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకు అలాగే ఖతర్‌ వేదికగా జరిగిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో తన జట్టును గెలిపించినందుకు మెస్సీ ఈ అవార్డును అందుకున్నాడు. అలా అత్యధిక సార్లు (8) ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. అయితే అత్యధిక బాలన్‌ డి ఓర్‌ అవార్డు పొందిన వారిలో క్రిస్టియానో రొనాల్డో(5) రెండో స్థానంలో ఉన్నాడు.

Ballon D'Or Award Messi : బెస్ట్​ ఫుట్‌బాలర్​గా మెస్సీకి ప్రతిష్టాత్మక అవార్డ్​.. రికార్డ్​ స్థాయిలో ఏకంగా 8వ సారి

మెస్సి Vs రొనాల్డో - ఈ ఇద్దరు దిగ్గజ ప్లేయర్లలో ఎవరు గొప్ప ?

ABOUT THE AUTHOR

...view details