ప్రముఖ ఛానల్ స్టార్ ఇండియా పెద్ద మనసు చాటుకుంది. కరోనాతో కొట్టుమిట్టాడుతోన్న మన దేశానికి రూ.50 కోట్ల విరాళం ప్రకటించింది.
ఆక్సిజన్ కోసం ఆ ఛానల్ రూ.50 కోట్ల విరాళం - స్టార్ ఇండియా ఛానెల్
కరోనా కోరల్లో చిక్కుకున్న మన దేశానికి ప్రముఖ ఛానల్ స్టార్ ఇండియా భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సహా ఇతర వైద్య సామాగ్రి కొనుగోలు చేసేందుకు రూ.50 కోట్ల విరాళం ప్రకటించింది.
స్టార్ ఇండియా
కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో చికిత్సకు సంబంధించిన వైద్యపరికరాలు, వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యాలను మెరుగుపర్చడం కోసం ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని 'ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా అండ్ స్టార్ ఇండియా' ప్రెసిడెంట్ కె.మాధవన్ తెలిపారు. గతేడాది కూడా కరోనా కట్టడి పోరులో భాగంగా ఈ ఛానెల్ రూ.28 కోట్లు విరాళంగా ఇచ్చింది.
ఇదీ చూడండి:'పీఎం కేర్స్'కు కాదు యూనిసెఫ్ ద్వారా విరాళం: కమిన్స్