తెలంగాణ

telangana

ETV Bharat / sports

పారాలింపిక్స్​కు వెళ్లనున్న భారత అథ్లెట్లు వీరే.. - దేవేంద్ర జజారియా

పారాలింపిక్స్​కు వెళ్లనున్న 24 మంది సభ్యుల జాబితాను విడుదల చేసింది భారత పారాలింపిక్ కమిటీ. రియో ఒలింపిక్స్​లో స్వర్ణాలు గెలిచిన మరియప్పన్​ తంగవేలుతో పాటు దేవేంద్ర జజారియా వంటి ఆటగాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. టోక్యో వేదికగా ఆగస్టు 24 నుంచి పారాలింపిక్స్​ ప్రారంభం కానున్నాయి.

paralimpics list, india paralimpics committe
పారాలింపిక్స్ జాబితా, భారత పారాలింపిక్ కమిటీ

By

Published : Jul 4, 2021, 8:55 AM IST

టోక్యో పారాలింపిక్స్​కు భారత జట్టు 24 మంది అథ్లెట్లను బరిలో దించుతోంది. తంగవేలు మరియప్పన్, దేవేంద్ర జజారియా లాంటి స్టార్ అథ్లెట్లతో కూడిన 24 మంది సభ్యుల జాబితాను భారత పారాలింపిక్ కమిటీ విడుదల చేసింది. రియో ఒలింపిక్స్​లో పసిడి పతకాలు గెలిచిన మరియప్పన్, దేవేంద్రతో పాటు తమ విభాగాల్లో ప్రపంచ రికార్డులు ఖాతాలో ఉన్న సందీప్ చౌదరి, సుమిత్ లాంటి వాళ్లు ఈ క్రీడలకు వెళ్తున్నారు.

జూన్ 29, 30 తేదీల్లో దిల్లీలోని జవహర్​లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ట్రయల్స్ ద్వారా దీపా మలిక్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ఈ అథ్లెట్లను ఎంపిక చేసింది. ఈ జట్టులో దేవేంద్ర జజారియా, అజీత్ సింగ్, సుందర్ సింగ్ గుర్జార్ (జావెలిన్, ఎఫ్ 46), సందీప్ చౌదరి, సుమిత్ (జావెలిన్ ఎఫ్ 64), తంగవేలు, శరద్​కుమార్, వరుణ్ బాటి (హైజంప్, టీ-63), అమిత్కు​మార్, ధర్మబీర్ (క్లబ్ త్రో ఎఫ్-51), నిషద్ కుమార్, రామాల్ (హైజంప్, టీ-47), ప్రవీణ్ కుమార్ (హైజంప్ టీ-64), యోగేశ్ (డిస్కస్ త్రో ఎఫ్-56), వినోద్ (డిస్కస్తో ఎఫ్-56), రంజిత్ (జావెలిన్ ఎఫ్ 57), అరవింద్ (షాట్పుట్ ఎఫ్-35), తెక్చంద్ (జావెలిన్ ఎఫ్-54), నవీప్ (జావెలిన్ ఎఫ్ 41), సోనమ్ రాణా (షాట్పుట్, ఎఫ్-57), ఏక్తా. కాశిప్ లాక్రా (క్లబ్ త్రో ఎఫ్-51), భాగ్యశ్రీ (షాట్పుట్ ఎఫ్-34), సిమ్రన్ (100 మీ, టీ-13) ఉన్నారు. సంజయ్ (జావెలిన్ ఎఫ్-64) రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు.

ఆగస్టు 24న పారాలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.

ఇదీ చదవండి:ప్రపంచ రికార్డుతో టోక్యో పారాలింపిక్స్​కు దేవేంద్ర

ABOUT THE AUTHOR

...view details