జపాన్ రాజధాని టోక్యోలో మరికొన్ని గంటల్లో విశ్వక్రీడల ఆరంభ ఘట్టం అట్టహాసంగా ప్రారంభం కానుంది. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగే టోక్యోలోని ఒలింపిక్స్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆరంభ వేడుకలు మొదలుకానున్నాయి. నాలుగేళ్ల ఒకసారి జరిగే ఈ అంతర్జాతీయ క్రీడలను జపాన్ చక్రవర్తి నరుహిటో లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్వాగత ప్రసంగాలు, ఆయా దేశాల జాతీయజెండాల ఎగురవేత, క్రీడాకారుల పరేడ్, ఆతిథ్య దేశం తమ సాంస్కృతి, సంప్రదాయాలు, ఔనత్యాన్ని చాటేలా కళాకారుల ఆటపాటలు విశ్వక్రీడల ప్రారంభ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తారు.
ఈసారి పరేడ్‌లో పాల్గొనే క్రీడాకారుల సంఖ్యను కుదించారు. గతంలో 10 వేలకుపైగా క్రీడాకారులు ప్రారంభ వేడుకల పరేడ్‌లో పాల్గొనేవారు. ఎక్కువమంది కళాకారులతో కూడిన ప్రదర్శనలను ప్రీ-రికార్డింగ్ చేసి ప్రసారం చేయనున్నారు. మరికొన్ని లైవ్ ప్రోగ్రాంలూ నిర్వహించనున్నారు. కరోనా నిబంధనల మధ్య విశ్వ క్రీడల ఆరంభ వేడుకలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో మూవింగ్ ఫార్వర్డ్ థీమ్‌తో ఒలింపిక్స్ వేడుకలు నిర్వహిస్తుండగా.. యునైటెడ్ బై ఎమోషన్ అనే థీమ్‌తో టోక్యో-2020 ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సంరంభం జరగనుంది.
ప్రేక్షకుల లేకుండానే..