తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​కు షాక్​ - thailand open news

Thailand Open: ప్రపంచ ఛాంపియన్​ జోసీ గబుకోకు షాక్​ ఇచ్చింది భారత బాక్సర్​ మోనిక. థాయ్​లాండ్​ ఓపెన్​లో సోమవారం జరిగిన మ్యాచ్​లో 4-1 తేడాతో గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

thailand open boxing 2022
monika boxer

By

Published : Apr 4, 2022, 7:45 PM IST

Thailand Open: ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో రెండు సార్లు పతకాలు సాధించిన జోసీ గబుకోకు షాక్ ఇచ్చింది భారత బాక్సర్​ మోనిక. దీంతో థాయ్​లాండ్​ ఓపెన్​ 2022లో మహిళల 48 కేజీల విభాగంలో సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్​లో 4-1 తేడాతో అనుభవజ్ఞురాలైన గబుకోపై అద్భుత విజయం సాధించింది 26 ఏళ్ల మోనిక.

సెమీస్​లో వియత్నాంకు చెందిన ట్రాన్​ థి దియేమ్​తో తలపడనుంది హరియాణాకు చెందిన మోనిక. భారత్​కు చెందిన ఆశిష్​ కుమార్​, మనీషా కూడా ఆమెతో పాటుగా ఈ టోర్నమెంట్​లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు.

ఇదీ చూడండి:ఈ కిక్​బాక్సర్​ పంచ్​లకే కాదు.. పరువాలకూ పతకాలివ్వాలేమో!

ABOUT THE AUTHOR

...view details