Thailand Open 2022: రెండు సార్లు ఒలింపిక్ విజేత పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో సెమీస్‌లోకి ప్రవేశించింది. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై 2-1తేడాతో గెలుపొందింది.
Thailand Open 2022: సత్తా చాటిన సింధు.. సెమీస్‌లోకి ప్రవేశం - పీవీ సింధు
Thailand Open 2022: థాయ్‌లాండ్ ఓపెన్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో యమగుచిపై 21-15, 20-22, 21-13 తేడాతో గెలుపొందింది.
PV Sindhu
తొలి గేమ్‌లో 21-15 తేడాతో సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే రెండో గేమ్‌లో (20-22) యమగుచి పుంజుకోగా.. మూడో గేమ్ (21-13) గెలిచి సెమీస్ చేరుకుంది సింధు.