భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు వెల్లడించింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని మూడు పేజీల నోట్‌ను ట్విట్టర్‌లో విడుదల చేసింది. ఇందులో సానియా టెన్నిస్‌లో తన సుదీర్ఘ ప్రయాణం,అనుభవాలను తెలిపింది.
సానియా మీర్జా సంచలన ప్రకటన - Sania Mirza latest news
21:20 January 13
సానియా మీర్జా రిటైర్మెంట్
హైదరాబాద్‌లో తన తల్లితో కలిసి 30 సంవత్సరాల కిందట తొలిసారి నిజాం క్లబ్‌లో టెన్నిస్ కోర్టుకు వెళ్లానని, అక్కడ కోచ్ టెన్నిస్ ఎలా ఆడాలో వివరించిందినట్లు గుర్తు చేసుకుంది. 6ఏళ్ల వయసు నుంచే నా కలలను సాకారం చేసుకునేందుకు పోరాటం మొదలైందన్న సానియా.. అన్ని సమయాల్లో తల్లిదండ్రులు, కుటుంబం, కోచ్, ఫిజియో, మొత్తం టీం మద్దతు లేకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదంది. ప్రతి ఒక్కరితో కన్నీళ్లు, బాధ, సంతోషం పంచుకున్నానన్న సానియా.. అందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానంది. హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నారికి కలలు కనే ధైర్యాన్ని అందించడమే కాకుండా ఆ కలలను సాధించడంలో సహాయం చేశారంటూ ధన్యవాదాలు తెలిపింది.
సానియా తన కెరీర్‌లో 36 సంవత్సరాల వయసులో ఈ నెలలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లో కజకిస్తాన్‌కు చెందిన అనా డానిలినాతో కలిసి గ్రాండ్‌స్లామ్‌లో ఆడనుంది. మోచేయి గాయం కారణంగా గతేడాది యూఎస్ ఓపెన్‌కు దూరమైంది. ఇటీవల కాలంలో ఫిట్‌నెస్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో గతేడాదే రిటైర్‌మెంట్ ప్రకటించింది. గాయం కారణం ఆస్ట్రేలియన్ ఓపైన్ నుంచి వైదలొగడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నది. సానియా కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్‌లను సాధించింది. ప్రపంచ నంబర్ వన్ డబుల్స్ క్రీడాకారిణి నిలిచింది. అంతకు ముందు సింగిల్స్‌నూ సత్తాచాటింది. వరల్డ్ ర్యాకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది. 2005లో యూఎస్ ఓపెన్స్‌లో నాల్గో రౌండ్‌కు చేరింది.
ఇదీ చూడండి: Hockey world cup: హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం