తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ మిక్స్​డ్ డబుల్స్ విజేతగా క్రిస్టినా-ఇవాన్ - australian open 2022 winner

Tennis Mixed Doubles Championship: ఆస్ట్రేలియన్​ టెన్నిస్ మిక్స్​డ్​ డబుల్స్ ఛాంపియన్స్​లో క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్​), ఇవాన్​ డోడిగ్​(క్రొయేషియా)జోడీ విజేతగా నిలిచింది. వరుస సెట్లలో 6-3, 6-4తో ఆస్ట్రేలియన్​ జంట జైమీ ఫోర్లిస్, జాసన్ కుబ్లర్‌ను ఓడించింది.

Tennis Mixed Doubles Championship
ఆస్ట్రేలియా టెన్నిస్ మిక్స్​డ్​ డబుల్స్ ఛాంపియన్స్

By

Published : Jan 28, 2022, 11:23 AM IST

Tennis Mixed Doubles Championship: ఆస్ట్రేలియన్ మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్‌లో క్రిస్టినా మ్లాడెనోవిచ్(ఫ్రాన్స్‌), ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జోడీ విజయం సాధించింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు జైమీ ఫోర్లిస్, జాసన్ కుబ్లర్‌ జంటను 6-3, 6-4 తేడాతో ఓడించింది.

2014లో డేనియల్ నెస్టర్‌తో కలిసి మ్లాడెనోవిచ్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను ఇప్పటికే గెలుచుకుంది. 2018, 2020లో రెండుసార్లు మహిళల డబుల్స్ టైటిల్స్​ను సొంతం చేసుకుంది.

డోడిగ్ ఇప్పటికే మూడు గ్రాండ్ స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లను, పురుషుల డబుల్స్‌లో.. గత ఏడాది ఫిలిప్ పోలాసెక్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో సహా రెండు టైటిల్‌లను సొంతం చేసుకున్నాడు.

రఫెల్ నాదల్, మాటియో బెరెట్టిని మధ్య పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ శుక్రవారం జరగనుంది. ఇందులో నాదల్ విజయం సాధించి, ఫైనల్​లోనూ గెలిస్తే రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్​స్లామ్ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్న ప్లేయర్​గా చరిత్ర సృష్టిస్తాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:Australian Open: 42 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఫైనల్లోకి ఆష్లే బార్టీ

ABOUT THE AUTHOR

...view details