మహిళల స్పీడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్‌మాస్టర్, ర్యాపిడ్ ప్రపంచ ఛాంపియన్ కోనేరు హంపి అద్భుత విజయం సాధించింది. ప్రపంచ నంబర్‌వన్ హో ఇఫాన్ (చైనా)కు షాకిస్తూ ఈ తెలుగమ్మాయి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
శుక్రవారం జరిగిన సెమీస్‌లో హంపి 6-5తో ఇఫాన్‌ను ఓడించింది. ఈ పోరులో తొలి గేమ్ హంపి గెలవగా.. ఆ తర్వాత గేమ్‌ను ఇఫాన్ దక్కించుకుంది. ఆ తర్వాత రెండు గేమ్‌లను హంపి, ఇఫాన్ చెరొకటి నెగ్గడం వల్ల పోటీ ఉత్కంఠగా మారింది.