తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tata open: బోపన్న జోడీదే టైటిల్ - ఏటీపీ వరల్డ్​ టూర్ టైటిల్

bopanna atp title: టాటా ఓపెన్​లో బోన్న-రామ్​కుమార్ జోడీ విజేతగా నిలిచింది. తుదిపోరుతో ల్యూక్-జాక్ జోడీపై విజయం సాధించింది.

bopanna atp title
బోపన్న టాటా ఓపెన్

By

Published : Feb 7, 2022, 7:17 AM IST

టాటా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న-రామ్‌కుమార్‌ రామనాథన్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. పుణెలో ఆదివారం హోరాహోరీగా జరిగిన డబుల్స్‌ ఫైనల్లో బోపన్న-రామ్‌కుమార్‌ 6-7 (10-12), 6-3, 10-6తో ల్యూక్‌ సావిల్లె-జాక్‌ ప్యాట్రిక్‌ (ఆస్ట్రేలియా)పై పోరాడి గెలిచారు.

టైబ్రేకర్‌కు మళ్లిన తొలి సెట్లో బోపన్న జోడీ గట్టిగానే పోరాడినా సెట్‌ కోల్పోయింది. అయితే రెండో సెట్లో బలంగా పుంజుకున్న భారత జంట మూడో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి, ఆపై సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. సూపర్‌ టై బ్రేకర్‌లో కూడా పోటీ నువ్వానేనా అన్నట్లే నడిచింది. అయితే తొమ్మిదో గేమ్‌లో బ్రేక్‌ సాధించిన బోపన్న జోడీ ఆపై సెట్‌తో పాటు ట్రోఫీని గెలుచుకుంది.

రోహన్‌ బోపన్న-రామ్‌కుమార్‌ రామనాథన్‌

బోపన్నకు ఇది 21వ ఏటీపీ డబుల్స్‌ టైటిల్‌ కాగా.. రామ్‌కుమార్‌కు రెండోది. గత నెల అడిలైడ్‌ ఓపెన్‌లో బోపన్న-రామ్‌కుమార్‌ తొలిసారి జోడీ కట్టారు. ఆ టోర్నీలో ఫైనల్‌ చేరినా రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నారు. టాటా ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ను సౌసా (పోర్చుగల్‌) గెలుచుకున్నాడు. ఫైనల్లో అతడు 7-6 (11-9), 4-6, 6-1తో ఎమిల్‌ (ఫిన్లాండ్‌)పై నెగ్గాడు.

ABOUT THE AUTHOR

...view details