తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీకాంత్​ శుభారంభం.. ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్స్​కు సాత్విక్​ జోడీ షాక్​ - kidambi srikanth world ranking

Swiss Open Badminton: స్విస్​ ఓపెన్​ తొలి రౌండ్​లో భారత స్టార్​ షట్లర్​ కిదాంబి శ్రీకాంత్​.. డెన్మార్క్​ ఆటగాడు మాడ్స్‌ క్రిస్టోఫెర్సెన్‌పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్​లో ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్స్​ ఫిక్రి-బాగాస్​ జంటను భారత జోడీ సాత్విక్​-చిరాగ్​ ఓడించింది.

Swiss Open Badminton
sathwik chirag pair

By

Published : Mar 24, 2022, 6:50 AM IST

Swiss Open Badminton: స్విస్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశాడు. బుధవారం పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఏడో సీడ్‌ శ్రీకాంత్‌ 21-16, 21-17తో మాడ్స్‌ క్రిస్టోఫెర్సెన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించాడు. 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ సంపూర్త ఆధిపత్యంతో ప్రత్యర్థిని చిత్తుచేసి ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నాడు. పారుపల్లి కశ్యప్‌ కూడా సునాయాసంగానే రెండో రౌండు చేరాడు. అతను 21-17, 21-9తో ఫ్రాన్స్‌ ఆటగాడు ఎనగోత్‌ రాయ్‌ను ఓడించాడు. మరోవైపు టోర్నీలో సాయిప్రణీత్‌ కథను భారత ఆటగాడే అయిన హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ ముగించాడు. హోరాహోరీ పోరులో ప్రణీత్‌ 23-25, 16-21తో ప్రణయ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు.

కిదాంబి శ్రీకాంత్‌

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి జోడీ అదిరే ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 17-21, 21-11, 21-18తో షోహిబుల్‌ ఫిక్రి- బాగాస్‌ మౌలానా (ఇండోనేసియా) జంటపై గెలిచింది. ఫిక్రి-బాగాస్‌ ఇటీవలే ప్రతిష్ఠాత్మక ఆల్‌ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలవడం విశేషం. అశిత్‌ సూర్య-వసంతకుమార్‌ జోడీ 14-21, 17-21తో సీడ్‌ వెండీ-బెన్‌ లేన్‌ (ఇంగ్లాండ్‌) ద్వయం చేతిలో ఓటమి చవిచూసింది. ఆల్‌ఇంగ్లాండ్‌లో సెమీస్‌ చేరి ఆశ్చర్యపరిచిన గాయత్రి గోపీచంద్‌ పుల్లెల- ట్రీసా జాలీ జంటకు స్విస్‌ ఓపెన్‌లో షాక్‌ తగిలింది. ఈ జోడీ మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో 10-21, 17-21తో రెండో సీడ్‌ జాంగోఫాన్‌- ప్రజోంగ్జయ్‌ (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్‌ 5-21, 17-21తో యోనె లీ (జర్మనీ) చేతిలో ఓడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో సుమీత్‌రెడ్డి- అశ్విని పొన్నప్ప జోడీ 13-21, 9-21తో గికెల్‌- డెల్ఫైన్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో ఓటమి పాలైంది.
ఇదీ చదవండి:ఆష్లే బార్టీ షాకింగ్ నిర్ణయం.. 25ఏళ్లకే రిటైర్మెంట్

ABOUT THE AUTHOR

...view details