తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్విస్​ ఓపెన్​.. ఫైనల్​కు చేరిన సింధు, ప్రణయ్​ - స్విస్​ ఓపెన్​ 2022 ప్రణయ్​

Swis open 2022 Hspranoy Pv sindhu: స్విస్​ ఓపెన్​లో భారత స్టార్​ షట్లర్లు​ హెచ్​ఎస్​ ప్రణయ్, పీవీ సింధు అదరగొట్టారు. సెమీఫైనల్​లో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించారు.

Swis open 2022 Pv sindhu Hs prannoy
సింధు, ప్రణయ్

By

Published : Mar 26, 2022, 10:14 PM IST

Swis open 2022 Hs pranoy Pv sindhu: స్విస్​ ఓపెన్​లో భాగంగా నేడు (శనివారం) జరిగిన పోటీల్లో భారత స్టార్​ షట్లర్లు హెచ్​ఎస్​ ప్రణయ్​​, పీవీ సింధు అదరగొట్టారు.

పురుషుల సింగిల్స్​ సెమీఫైనల్లో ఇండోనేసియాకు చెందిన ప్రపంచ ఐదో సీడ్​ ఆంథోనీ సిన్సుకాపై 21-19 19-21 21-18 తేడాతో గెలిచి పైనల్​కు చేరాడు ప్రణయ్​​. ఈ మ్యాచ్​ గంటా 11 నిమిషాల పాటు సాగింది. 2017 యూఎస్​ ఓపెన్​ టైటిల్​ను గెలిచిన ఐదేళ్ల తర్వాత ప్రణయ్​ తొలిసారి ఫైనల్​కు అర్హత సాధించాడు. తుదిపోరులో భారత క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ లేదా ఇండోనేసియాకు చెందిన జొనాటన్ క్రిస్టీతో ప్రణయ్​ తలపడనున్నాడు.

మహిళల సింగిల్స్​ సెమీఫైనల్​లో పీవీ సింధు కూడా అదరగొట్టింది. కేట్​థాంగ్​పై 21-18, 15-21, 21-19 తేడాతో విజయం సాధించింది. ఫలితంగా తుదిపోరుకు అర్హత సాధించింది.

ఇదీ చూడండి: మార్షల్ ఆర్ట్స్ అమ్మడు.. 'కిక్' ఇచ్చే పోజులు


ABOUT THE AUTHOR

...view details