తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాలికపై కోచ్ వేధింపులు.. రంగంలోకి క్రీడామంత్రి

బాలికపై వేధింపుల ఆరోపణల కారణంగా గోవాకు చెందిన స్విమ్మింగ్​ కోచ్​ సురజిత్​​​ గంగూలీపై వేటు పడింది. అతడిని శిక్షకుడి బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ).

బాలికపై కోచ్ వేధింపులు.. రంగంలోకి క్రీడామంత్రి

By

Published : Sep 5, 2019, 5:12 PM IST

Updated : Sep 29, 2019, 1:28 PM IST

బాలికపై వేధింపులకు పాల్పడిన గోవాకు చెందిన స్విమ్మింగ్​ కోచ్​ సురజిత్​​​ గంగూలీపై చర్యలు తీసుకుంది స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ). ఇటీవల బాలికపై వేధింపులకు సంబంధించిన.. సురజిత్​​ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. వెంటనే బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐని ఆదేశించారు.

కోచ్​ సురజిత్​​ గంగూలీ

" ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. గోవా స్విమ్మింగ్​ అసోసియేషన్​ కోచ్​ సురజిత్​ గంగూలీ కాంట్రాక్టు పదవిని రద్దు చేశాం. దేశంలోని మిగతా స్విమ్మింగ్ ఫెడరేషన్‌లలోనూ అతడిని తీసుకోవద్దని ఆదేశాలిచ్చాం. ఇది అన్ని ఫెడరేషన్లకు వర్తిస్తుంది".
- కిరణ్​ రిజిజు, క్రీడాశాఖ మంత్రి

రెండున్నరేళ్ల కాలానికి అతడిని కోచ్​ పదవికి ఎంపిక చేసింది జీఎస్​ఏ. 2017లో ఉత్తమ కోచ్​ అవార్డుతో సత్కరించింది గోవా ప్రభుత్వం. అయితే తాజా ఘటనపై దర్యాప్తు కోసం కేంద్రమంత్రి ఆదేశాలతో రాష్ట్ర విభాగం ఓ ప్రత్యేత కమిటీ వేసింది.

ఇదీ చదవండి...'టీమిండియాతో పోరు... నిద్ర లేక బేజారు'

Last Updated : Sep 29, 2019, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details