తెలంగాణ

telangana

ETV Bharat / sports

గాయమైనా సుశీల్​ కుమార్ రెజ్లింగ్​​​​ ఆడాల్సిందే..!

భారత స్టార్​ రెజ్లర్ సుశీల్​ కుమార్​కు భారత రెజ్లింగ్ సమాఖ్య​ (డబ్ల్యూఎఫ్​ఐ) షాకిచ్చింది. ఈరోజు జరగాల్సిన 74 కేజీల ఫ్రీస్టయిల్​ విభాగం ట్రయల్స్​ను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. చేతి గాయం కారణంగా మ్యాచ్​లను తర్వాత నిర్వహించాలన్న ఆటగాడు విన్నపాన్ని తిరస్కరించింది.

Sushil Kumar's 74kg category Trail
గాయమైనా సుశీల్​కుమార్ రెజ్లింగ్​​​​ ఆడాల్సిందే..!

By

Published : Jan 3, 2020, 5:34 AM IST

భారత క్రీడారంగంలో గొప్పగా వెలిగిన క్రీడాకారుల్లో ముందు వరుసలో ఉండే ఆటగాడు సుశీల్‌ కుమార్‌. ఈ దిగ్గజ రెజ్లర్‌ సాధించిన ఘనతలు ఎన్నో. వరుసగా రెండు ఒలింపిక్స్‌ (2008 బీజింగ్‌-కాంస్యం, 2012 లండన్‌-రజతం) పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు. అలాంటి ఆటగాడు కొంత కాలంగా కెరీర్​ను చక్కదిద్దుకోలేక ఇబ్బంది పడుతున్నాడు.

ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత రెజ్లింగ్ సమాఖ్య​ (డబ్ల్యూఎఫ్​ఐ) నిర్వహించే ట్రయల్స్​కు దూరమయ్యాడు సుశీల్​. చేతికి గాయం కావడం వల్ల తను బరిలో దిగనున్న 74 కేజీల ఫ్రీస్టయిల్​ విభాగం పోటీలను వాయిదా వేయాలని కోరాడు. అందుకు డబ్ల్యూఎఫ్​ఐ తిరస్కరించింది. ఫలితంగా నేడు జరగనున్న ఈ పోటీలకు అతడు అందుబాటులో ఉండట్లేదు. అయితే మార్చిలో మళ్లీ తన అదృష్టం పరీక్షించుకునే అవకాశం ఉంది. ఈ ట్రయల్స్​ను పురుషుల ఫ్రీస్టయిల్​లో ఐదు విభాగాల్లో, గ్రీక్​-రోమన్​ స్టయిల్​లో 6 విభాగాల్లో నిర్వహించనున్నారు.

వరుసగా టోర్నీలు...

ఈ ట్రయల్స్​ గెలిచిన వాళ్లు ఈ ఏడాది పలు టోర్నీల్లో పాల్గొననున్నారు. ఫస్ట్​ ర్యాంకింగ్​ సిరీస్​​(జనవరి 15-18), ఆసియా ఛాంపియన్​షిప్​(ఫిబ్రవరి 18-23), ఆసియన్​ ఒలింపిక్​ క్వాలిఫయర్​(మార్చి 27-29) మ్యాచ్​ల్లో క్రీడాకారులు తలపడనున్నారు.

ఇప్పటికే పురుష రెజ్లర్లలో.. రవి దహియా(57 కేజీలు), బజరంగ్​ పునియా(65 కేజీలు), దీపక్​ పునియా(86 కేజీలు), మహిళల్లో వినేశ్​ ఫొగాట్​(53 కేజీలు) ఇప్పటికే ఒలింపిక్స్​ బెర్త్​ ఖరారు చేసుకున్నారు. శనివారం మహిళల ట్రయల్స్​ నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details