తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెజ్లర్ల పిటిషన్​పై దిల్లీ సర్కారుకు సుప్రీం నోటీసులు.. ఆరోజే విచారణ - రెజ్లర్ల నిరసన పై సుప్రీం కోర్టు

రెజ్లరు దాఖలు చేసిన పిటిషన్​ను దృష్టిలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంను ఆశ్రయించిన ఏడుగురు ఫిర్యాదుదారుల పేర్లను.. గోప్యత కోసం న్యాయపరమైన రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశించింది.

supreme court responds to wrestlers pietition
supreme court responds to wrestlers pietition

By

Published : Apr 25, 2023, 11:30 AM IST

Updated : Apr 25, 2023, 12:53 PM IST

రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దిల్లీ పోలీసులు ఫిర్యాదు నమోదు చేయలేదంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. రెజ్లర్లు వేసిన పిటిషన్​ను దృష్టిలో ఉంచుకుని దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.

లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదన్న విషయంపై సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ చేసిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చింది. "నోటీసులను జారీ చేయండి. శుక్రవారం ఈ పిటీషన్​ను (విచారణ కోసం) లిస్ట్​లోకి చేర్చండి" అని బెంచ్ స్పష్టం చేసింది. అంతే కాకుండా ఆ ఏడుగురు ఫిర్యాదుదారుల పేర్లను.. గోప్యత కోసం రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశించింది.

కాగా, బ్రిజ్‌ భూషణ్‌పై ఆరోపణలు చేసిన రెజ్లర్లు.. ఈ ఏడాది జనవరిలోనే జంతర్​ మంతర్​ ఎదుట తొలిసారి బైఠాయించారు. మీడియా ముందు వారి గోడును వెల్లబోసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. ఓ కమిటీని ఏర్పాటు చేసి విషయాన్ని దర్యాప్తు చేసేందుకు ఆదేశించింది. ఈ ఆరోపణలన్నింటినీ దర్యాప్తు చేసిన పర్యవేక్షక కమిటీ.. నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఆ నివేదికను ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం బయటపెట్టలేదు. అంతే కాకుండా బ్రిజ్‌ భూషణ్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన రెజ్లరు ఆదివారం మరోసారి జంతర్​ మంతర్​ ముందు నిరసనకు దిగారు. అప్పటి నుంచి అక్కడే దీక్ష చేస్తూ రోడ్డుపైనే కూర్చున్నారు. వీరికి మద్దతిస్తూ దిల్లీ మహిళా కమిషన్‌ సైతం స్థానిక పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

రెజ్లర్లకు రాజకీయ నేతల మద్దతు..
సోమవారం రాత్రి కూడా జంతర్​ మంతర్​ వద్ద బజరంగ్, సాక్షి, సంగీత, వినేష్‌తో సహా పలువురు రెజ్లర్లు జంతర్ మంతర్ నిరసన ప్రదేశంలో నిద్రించారు. అయితే వీరికి మద్దతుగా పలువురు రాజకీయ నేతలు జంతర్​మంతర్​ వద్దకు తరలివచ్చారు. ఇందులో భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా, ఆప్ రాజ్యసభ ఎంపీ సుశీల్ గుప్తా, ఐద్వా మహిళా సభ్యులు ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వ క్రీడా విధానానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగిన క్రీడాకారులకు మద్దతుగా హరియాణా మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "దేశానికి గుర్తింపు తెచ్చిన అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ధర్నాకు దిగడం చాలా విచారకరం, వారికి న్యాయం చేయాలని, దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశానికి నేనే వెళ్తాను" అని ఆయన ఓ ట్వీట్​లో పేర్కొన్నారు. రెజ్లర్లకు మద్దతుగా పలువురు రాజకీయ నేతలు జంతర్​ మంతర్​ వద్దకు చేరుకోనున్నట్లు సమాచారం.

Last Updated : Apr 25, 2023, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details