SAFF Championship 2023 : దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన టోర్నీలో భారత జట్టుకు అద్భుత ఆరంభం లభించింది. టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్.. బుధవారం ఆడిన తొలి మ్యాచ్‌లో 4-0 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టి కరిపించింది. ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ సునీల్ ఛెత్రి.. హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టును విజయ పథంలోకి నడిపించాడు.
మ్యాచ్‌లో ఆరంభం నుంచి భారత్ హవానే సాగింది. ఇటీవలే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ను గెలిపించిన ఊపులో ఉన్న ఛెత్రి.. అంతే దూకుడుగానే ఈ టోర్నీలో ఆడాడు. అతను 10వ నిమిషంలోనే ఫీల్డ్ గోల్‌తో జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఇంకో ఆరు నిమిషాలకే పెనాల్టీని గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఆ తర్వాత కూడా భారత్ గోల్ దాడులు కొనసాగించగా.. ప్రథమార్ధం అయ్యే వరకు మరో గోల్ కాకుండా పాక్ అడ్డుకోగలిగింది. ద్వితీయార్ధంలో కూడా ఒకానోక దశ వరకు పాక్ డిఫెన్స్ బాగానే పని చేసింది. అయితే 74వ నిమిషంలో పాక్ ఆటగాళ్లు ఛెత్రిని కింద పడేయడం వల్ల రిఫరీ పెనాల్టీ కిక్ ఇచ్చాడు. ఇక ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఛెత్రి పొరపాటుకు తావివ్వకుండా దాన్ని గోల్‌గా మలిచి.. పాక్‌ను అవాకయ్యేలా చేశాడు. ఇంకో ఏడు నిమిషాలకే సబ్‌స్టిట్యూట్ ఉదంత సింగ్ గోల్ కొట్టడం వల్ల భారత్ మరింత ఘనంగా మ్యాచ్‌ను ముగించింది. శనివారం ఛెత్రిసేన తన తర్వాతి మ్యాచ్‌లో నేపాల్‌ను ఢీకొంటుంది.