తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ పారా అథ్లెట్​ ఛాంపియన్​షిప్​లో భారత్​కు స్వర్ణం - sunder singh para athlete

భారత అథ్లెట్ సుందర్ సింగ్ గుర్జార్.. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్స్​లో స్వర్ణం సాధించాడు. జావెలిన్​ త్రోలో 61.22 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలవడమే కాకుండా 2020 టోక్యో పారా ఒలింపిక్స్​కూ అర్హత సాధించాడు.

సుందర్ సింగ్

By

Published : Nov 12, 2019, 8:05 AM IST

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్‌ సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ సత్తాచాటాడు. పురుషుల ఎఫ్‌46 జావెలిన్‌ త్రో టైటిల్‌ను నిలబెట్టుకున్న అతడు 2020 టోక్యో పారా ఒలింపిక్స్‌ బెర్త్‌నూ సాధించాడు.

ఆదివారం జరిగిన పోటీల్లో సీజన్‌ అత్యుత్తమ ప్రదర్శనతో జావెలిన్‌ను 61.22 మీటర్ల దూరం విసిరిన సుందర్‌ పసిడి కైవసం చేసుకున్నాడు.అజీత్‌ సింగ్‌, రింకూలు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. అజీత్‌ 59.46 మీటర్ల దూరం విసిరి కాంస్యం సాధించాడు.

23 ఏళ్ల సుందర్‌ గత ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ (2017)లోనూ స్వర్ణం గెలిచాడు. దేవేంద్ర ఝజారియా (2013 స్వర్ణం, 2015 రజతం) తర్వాత ప్రపంచ పారా ఛాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత అథ్లెట్‌గా సుందర్‌ రికార్డు సృష్టించాడు.

మరోవైపు పురుషుల డిస్కస్‌ త్రోలో (ఎఫ్‌ 56) యోగేశ్‌ రజతం గెలిచాడు. డిస్క్‌ను 42.05 మీటర్ల దూరం విసిరిన అతను రెండో స్థానంలో నిలిచాడు.

ఇదీ చదవండి: ధోనీ పాఠాలు.. దీపక్ మార్కులు.. హ్యాట్రిక్ రికార్డులు

ABOUT THE AUTHOR

...view details