టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచే అవకాశాలు తమకున్నాయని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. అందుకు తగ్గట్లే తమ జట్టు ప్రణాళిక ప్రకారం ఎక్కువ సేపు శిక్షణ కూడా చేస్తున్నట్లు తెలిపాడు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న మహిళల హాకీ జట్టు కూడా ఈ మెగా క్రీడల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పింది సారథి రాణి రాంపాల్. ఒలింపిక్స్ ప్రారంభమయ్యే వరకు ఇకపై ప్రతిరోజు తమకు ఎంతో కీలకమని వెల్లడించింది.
మరోవైపు స్పెయిన్, జర్మనీతో జరగాల్సిన ఎప్ఐఎఫ్ ప్రో లీగ్, ప్రయాణ ఆంక్షల కారణంగా వాయిదా పడటం తమకు ఎదురుదెబ్బ తగిలినట్టయిందని ఇరుజట్ల కెప్టెన్లు అన్నారు. ఒకవేళ ఆ మ్యాచ్‌లు జరుగుంటే ఒలింపిక్స్ కోసం మరింత సన్నద్ధమయ్యేందుకు ఉపయోగపడేవని చెప్పారు.