తెలంగాణ

telangana

ETV Bharat / sports

సాత్విక్-చిరాగ్​ జోడీ అద్భుత పోరాటం.. కొరియా ఓపెన్​ టైటిల్​ కైవసం

Korea Open 500 : కొరియా ఓపెన్ సూపర్​ 500 బ్యాడ్మింటన్​ టోర్నీలో భారత స్టార్ షట్లర్స్​ సాత్విక్​ సాయిరాజ్​, చిరాగ్ శెట్టి మరోసారి తమ సత్తాను చాటారు. హోరా హోరీగా జరిగిన పురుషుల డబుల్స్ పోటీలో పాల్గొని టైటిల్​ను సొంతం చేసుకున్నారు.

Satwiksairaj Rankireddy and Chirag Shetty
Satwiksairaj Rankireddy and Chirag Shetty

By

Published : Jul 23, 2023, 1:34 PM IST

Updated : Jul 23, 2023, 2:35 PM IST

Korea Open Winner : కొరియా ఓపెన్ సూపర్​ 500 బ్యాడ్మింటన్​ టోర్నీలో భారత స్టార్ షట్లర్స్​ సాత్విక్​ సాయిరాజ్​, చిరాగ్ శెట్టి మరోసారి తమ సత్తాను చాటారు. హోరా హోరీగా జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్స్​లో ఇండోనేషియాకు చెందిన టాప్‌ సీడ్‌ ఫజర్‌ అల్‌పయాన్‌–ముహమ్మద్‌ రియాన్‌ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయాన్ని సాధించారు.

తొలి గేమ్‌ను 17-21లో ఓడినప్పటికీ రెండో మ్యాచ్​లో వేగం ఫుంజుకున్న ఈ జోడి.. ప్రత్యర్థి జంట చేస్తున్న సర్వీస్‌ను పదే పదే బ్రేక్‌ చేస్తూ ఆధిక్యంలో దూసుకెళ్లారు. అలా 21-13తో రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన కీలకమైన మూడో గేమ్‌లోనూ బలమైన స్మాష్‌ సర్వీస్‌లతో విరుచుకుపడిన సాత్విక్‌-చిరాగ్‌ జోడి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 21-14తో గేమ్‌ను ఓ కొలిక్కి తీసుకొచ్చి టైటిల్​ను ముద్దాడారు. ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ జోడీ ఈ ఏడాది వరుసగా మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Korea Open 2023 : 4-2తో టోర్నీని ప్రారంభించిన ఇండోనేషియా జోడీ.. వరుసగా 6 పాయింట్లు సాధించి 11-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత భారత జోడీ ప్రతిఘటించినప్పటికీ.. ఏమాత్రం అవకాశం ఇవ్వని ఇండోనేషియా ద్వయం 21-17తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.

ఆ తర్వాత నుంచి వేగం పెంచిన సాత్విక్-చిరాగ్ జోడీ రెండో గేమ్‌లో దుమ్మురేపారు. 5-4తో ఆధిక్యంలో వెళ్లి అదే జోరును కొనసాగించారు. బలమైన స్మాష్‌లతో 15-10తో లీడ్‌ను రెట్టింపు చేసుకున్న భారత ద్వయం.. వరుసగా 6 పాయింట్లు సాధించి 21-11 తేడాతో గేమ్‌ను సొంతం చేసుకుంది. అయితే వారు ఆఖరికి డిసైడర్ గేమ్ ఆడాల్సి వచ్చింది. ఈ క్రమంలో తుది గేమ్‌ను కూడా సాత్విక్-చిరాగ్‌లు అద్భుతంగా ఆరంభించారు. ఆరంభంలోనే 6-3తో ఆధిక్యం సాధించిన జంట.. అదే జోరును కొనసాగించి ఆధిక్యాన్ని చేజిక్కిచ్చుకున్నారు. అలా 21-13తో మూడో గేమ్‌ను గెలుచుకున్న భారత్ ద్వయం.. కొరియా ఓపెన్​ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

Last Updated : Jul 23, 2023, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details