తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: స్ప్రింటర్​ ద్యుతీ చంద్​కు ఒలింపిక్స్​ బెర్త్​ - dutee olympics in rankings quota

భారత మహిళా అథ్లెట్​​ ద్యుతీ చంద్(dutee chand) ఒలింపిక్స్​కు అర్హత సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్​ కోటా ఆధారంగా 100 మీ., 200 మీటర్ల పరుగులో పోటీ పడనుంది.

dutee chand, indian sprinter
భారత స్ప్రింటర్, ద్యుతీ చంద్

By

Published : Jun 30, 2021, 3:20 PM IST

Updated : Jun 30, 2021, 4:19 PM IST

భారత స్ప్రింటర్​ ద్యుతీ చంద్ టోక్యో​ ఒలింపిక్స్​కు(Tokyo Olympics) అర్హత సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్ కోటాలో 100 మీ, 200 మీ విభాగంలో బెర్త్​ ఖాయం చేసుకుంది. ఒలింపిక్స్​లో 100 మీ. పోటీల్లో 22 ఖాళీలు ఉండగా, 200 మీ. పరుగు పందెంలో 15 ఖాళీలు ఉన్నాయి. 100 మీ. విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్​లో 44వ స్థానంలో ఉన్న ద్యుతీ.. 200 మీ. విభాగంలో 51వ స్థానంలో నిలిచింది.

ఖేల్​రత్నకు సిఫార్సు..

దేశ అత్యున్నత క్రీడాపురస్కారం ఖేల్​రత్నకు(KhelRatna) ప్రముఖ అథ్లెట్​ ద్యుతీ చంద్​ పేరును నామినేట్​ చేసింది ఒడిశా ప్రభుత్వం. ఈమెతో పాటు మరో ఐదుగురి పేర్లను ఈ అవార్డులకు సిఫార్సు చేసింది.

"ఖేల్​రత్న అవార్డుకు నా పేరు నామినేట్​ చేసిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​కు ధన్యవాదాలు. నా మీద మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను."

-ద్యుతీ చంద్, భారత స్ప్రింటర్.

2018 ఆసియా గేమ్స్​లో 100 మీ., 200 మీ. ఈవెంట్​లో రజత పతకం​​ గెలుపొందిన ద్యుతీని గతేడాది అర్జున అవార్డు వరించింది. ద్యుతీతో పాటు పురుషుల హాకీ వైస్ కెప్టెన్ బిరేంద్ర లక్రా(అర్జున అవార్డు), హాకీ కోచ్​ కలు చరణ్ చౌదరీ(ద్రోణాచార్య అవార్డు), మాజీ స్ప్రింటర్​ అనురాధ బిస్వాల్(ధ్యాన్​చంద్)ను వివిధ అవార్డులకు నామినేట్ చేసింది ఒడిశా ప్రభుత్వం.

ఇదీ చదవండి:ద్యుతీ జాతీయ రికార్డు.. ఐనా దక్కని టోక్యో బెర్త్​

Last Updated : Jun 30, 2021, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details