Thailand open 2022 Pv sindhu Srikanth: ప్రతిష్టాత్మక థామస్ కప్ గెలుచుకున్న భారత బ్యాడ్మింటన్ జట్టు.. మరో మెగా టోర్నీ 'థాయ్‌లాండ్ ఓపెన్'పై దృష్టి సారించింది. ఈ క్రమంలో థాయ్‌లాండ్ ఓపెన్‌లో కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు శుభారంభాన్ని అందించారు. తొలి రౌండ్లో ఫ్రాన్స్ షట్లర్ లెవర్డెజ్‌పై శ్రీకాంత్ విజయం సాధించాడు. 18-21, 21-10, 21-16తో 49 నిమిషాల్లో లెవర్డెజ్‌పై పైచేయి సాధించి.. రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు శ్రీకాంత్. డెన్మార్క్ ప్లేయర్ హాన్స్-క్రిస్టియన్‌పై విజయం సాధించిన ఐర్లాండ్‌కు చెందిన నాట్ నుగుయెన్తో రెండో రౌండ్లో తలపడనున్నాడు శ్రీకాంత్. ఇక భారత స్టార్ షట్లర్ సింధు.. యుఎస్ఏకు చెందిన లారెన్ లామ్‌ను 21-19,19-21,21-18 తేడాతో ఓడించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.
Thailand open: శ్రీకాంత్, సింధు శుభారంభం.. సైనా, ప్రణయ్ ఔట్ - saina nehwal thailand open 2022
Thailand open 2022 Pv sindhu Srikanth: థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లరు కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు శుభారంభాన్ని అందించారు. అయితే మిగతా విభగాల్లో కొంతమంది భారత ఆటగాళ్లు మాత్రం నిరాశపరిచి.. మొదటి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు.
అయితే మరో స్టార్ ప్లేయర్ సైనాకు మాత్రం శుభారంభం దక్కలేదు. దక్షిణా కొరియా వరల్డ్ నెం.19 కిమ్‌పై(kim ga eun) 21-11,15-21,17-21 తేడాతో ఓడిపోయింది. మరో ప్లేయర్ అష్మిత కూడా థాయ్‌లాండ్ ప్లేయర్ చేతిలో 10-21, 15-21 తేడాతో ఓడిపోయింది. ఇకహెచ్ ఎస్ ప్రణయ్ కూడా మలేషియాకు చెందిన డారెన్ లీతో పోరాడి 17-21,21-15,15-21 తేడాతో ఓడగా.. మరో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో కశ్యప్.. కెనడా ఆటగాడి చేతిలో 13-21, 18-21 తేడాతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక మిక్స్‌డ్ డబుల్స్ జోడీ సుమీత్ రెడ్డి, అశ్విని పొన్నప్ప కూడా మొదటి రౌండ్లో ఓటమిని చవిచూశారు.
ఇదీ చదవండి:ముంబయి చివరి మ్యాచ్‌లో సచిన్ కొడుకు అర్జున్‌కు ఛాన్స్!