భారత అథ్లెట్ హిమా దాస్(hima das news)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న ఈమె.. ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని.. ఆరోగ్య పరిస్థితిగా బాగానే ఉందని చెప్పింది.
"నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నా. ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే కోలుకుని వీలనైంత తొందరగా బలంగా తిరిగివస్తా. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. సురక్షితంగా ఉండండి."