భారత మహిళా స్ప్రింటర్ ద్యుతీ చంద్ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఓ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నట్లు పేర్కొంది. ఆమెది ఒడిశాలోని చకా గోపాల్పూర్ అని చెప్పినా పేరు వెల్లడించేందుకు నిరాకరించింది. ఇలాంటి బంధాన్ని కలిగి ఉన్నానని ఓ భారతీయ అథ్లెట్ చెప్పడం ఇదే తొలిసారి.
అమ్మాయితో మహిళా అథ్లెట్ 'రిలేషన్షిప్'
మహిళా అథ్లెట్ ద్యుతీ చంద్.. సొంత రాష్ట్రం ఒడిశాకు చెందిన అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నట్లు చెప్పింది. ఇలాంటి బంధం కలిగి ఉన్నానని చెప్పిన భారత క్రీడాకారుల్లో ద్యుతి మొదటి వ్యక్తి.
అమ్మాయితో రిలేషన్లో ఉన్న మహిళా అథ్లెట్
100 మీటర్ల పరుగు పందెలో జాతీయ రికార్డు నెలకొల్పిన ద్యుతి.. 2018 ఆసియా క్రీడల్లో రెండు వెండి పతకాలు సాధించింది. ప్రపంచ ఛాంపియన్షిప్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధించేందుకు ప్రస్తుతం శిక్షణ తీసుకుంటోంది.
సెక్షన్ 377 ప్రకారం ఇద్దరు అమ్మాయిలు కానీ ఇద్దరు అబ్బాయిలు కానీ రిలేషిన్‌షిప్‌లో ఉండటం నేరం కాదని భారత సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ పెళ్లి చేసుకోవడం మాత్రం ఇంకా చట్టబద్ధం కాలేదు.