తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: మహిళల విభాగంలో ట్రాన్స్​జెండర్​.. అన్యాయం? - ట్రాన్స్​జెండర్​ వెయిట్​లిఫ్టర్​

టోక్యో ఒలింపిక్స్‌కు(Tokyo Olympics) తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్‌ అర్హత సాధించింది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో సత్తా చాటేందుకు న్యూజిలాండ్‌కు చెందిన లారెల్‌ హబ్బర్డ్‌(Laurel Hubbard) ఒలింపిక్స్‌లో పాల్గొనున్నారు. ఐతే.. ప్రపంచ క్రీడా సంగ్రామానికి మహిళ విభాగంలో ఓ ట్రాన్స్‌జెండర్‌ను పంపటం చర్చనీయాంశమైంది. ఇది మహిళా వెయిట్‌లిఫ్టర్‌లకు అన్యాయం చేసినట్లే అవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.

Sports Stars Speak Out Against Transgender Olympic Athlete Laurel Hubbard
Tokyo Olympics: మహిళల విభాగంలో ట్రాన్స్​జెండర్​.. సరైనది కాదు

By

Published : Jun 27, 2021, 7:56 AM IST

ప్రపంచ క్రీడా సంగ్రామం టోక్యో ఒలింపిక్స్‌(Tokyo Olympics)లో పాల్గొనేందుకు తొలిసారి ఓ ట్రాన్స్‌ జెండర్‌(Transgender) అర్హత సాధించారు. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో పోటీ పడేందుకు న్యూజిలాండ్‌ తరఫున లారెల్‌ హబ్బర్డ్‌(Laurel Hubbard) ఒలింపిక్స్‌లో అడుగు పెట్టనున్నారు. ఒలింపిక్స్‌ కోసం దేశీయంగా నిర్వహించిన వెయిట్‌లిఫ్టింగ్‌ అర్హత పోటీల్లో విజయం సాధించిన లారెల్‌.. మెగా టోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

ఒలింపిక్స్‌లో 87 కేజీల సూపర్‌ హెవీ వెయిట్‌ విభాగంలో లారెల్‌ హబ్బర్డ్‌ తలపడనున్నారు. 43 ఏళ్ల లారెల్‌ క్రీడల్లో పాల్గొనే.. అత్యధిక వయసు కలిగిన వెయిట్‌లిఫ్టర్‌గా ఉన్నారు. 2013లో పురుషుల విభాగంలో పోటీ పడిన లారెల్‌.. లింగ మార్పిడి అనంతరం మహిళల విభాగంలో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు.

వ్యతిరేకత

మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో ఓ ట్రాన్స్‌జెండర్‌ అర్హత సాధించటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహిళ వెయిట్‌లిఫ్టింగ్‌ విధానంలో.. లారెల్‌ హబ్బర్డ్‌ను ఒలింపిక్స్‌కు పంపటం సరైన నిర్ణయం కాదని పలు దేశాల వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారిణిలు ఆరోపిస్తున్నారు. లారెల్‌ హబ్బర్డ్‌ను మహిళల విభాగంలో ఒలింపిక్స్‌కు పంపటం అన్యాయమని.. బెల్జియం మహిళా వెయిట్‌లిఫ్టర్‌ అన్నా వాన్‌బెల్లింగ్‌హెన్(Anna Van Bellingen) ఆందోళన వ్యక్తం చేశారు. పురుషుడిగా ఉన్న వ్యక్తి.. మహిళగా మారినప్పుడు అతడి శరీర నిర్మాణం లారెల్‌ హబ్బర్డ్‌కు.. అనుకూలంగా మారే అవకాశముందని ది గ్రూప్స్‌ సహా వ్యవస్థాపకులు కెథరిన్‌ దెవెస్‌ అన్నారు.

మరోవైపు ట్రాన్స్‌జెండర్‌ లారెల్‌ హబ్బర్డ్‌ మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో.. అనేక పతకాలు సాధించారు. 2019లో నిర్వహించిన పసిఫిక్‌ గేమ్స్‌లో లారెల్‌ బంగారు పతకం కైవసం చేసుకోగా.. కామన్‌వెల్త్‌ క్రీడల పట్టికలోనూ అగ్రస్థానంలో నిలిచారు.

ఇదీ చూడండి..Tokyo Olympics: ఒలింపిక్స్​లో తొలిసారి ఓ ట్రాన్స్​జెండర్

ABOUT THE AUTHOR

...view details