'సూపర్‌హీరో'లకు చప్పట్లతో క్రీడాకారులు అభినందనలు - Sports Personality Salute Essential Service Providers Engaged in Fight Against Coronavirus after Janta Curfew
కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు చేపట్టిన 'జనతా కర్ఫ్యూ'లో యావత్ భారత్ పాల్గొన్నందుకు.. దేశంలోని ప్రముఖ క్రీడాకారులు ధన్యవాదాలు చెప్పారు. కరోనాపై చేస్తున్న సుదీర్ఘ యుద్ధంలో దేశ శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైద్యులు, అధికారులు, పోలీసులందరికీ సామాజిక మాధ్యమాల వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
!['సూపర్‌హీరో'లకు చప్పట్లతో క్రీడాకారులు అభినందనలు Sports Personality Salute Essential Service Providers Engaged in Fight Against Coronavirus after Janta Curfew](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6507198-941-6507198-1584886791958.jpg)
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును... యావత్ భారతావని స్వాగతించింది. కరోనాపై యుద్ధానికి నడుం కట్టింది. ఈ క్రమంలో దేశ శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైద్యులు, అధికారులు, పోలీసులందరికీ కృతజ్ఞతలు చెబుతూ.. ఆదివారం సాయంత్రం 5గంటలకు యావత్ దేశం చప్పట్లతో మార్మోగింది. ప్రజలు తమ ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లతో కరోనాపై పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో క్రికెటర్లు సచిన్, కైఫ్, సెహ్వాగ్ సహా పలువురు అథ్లెట్లు, ప్రముఖ క్రీడాకారులు.. సూపర్‌హీరోలకు అభినందనలు చెప్పారు.