ఖేలో ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా 500 ప్రైవేటు అకాడమీలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆర్థిక ప్రోత్సాహం అందించనుంది. వచ్చే నాలుగేళ్ల కోసం ఆర్థిక ప్రోత్సాహక వ్యవస్థను రూపొందించింది. 2028 ఒలింపిక్స్ కోసం ఎంపిక చేసిన 14 ప్రాధాన్య క్రీడల్ని తొలి దశ ప్రోత్సాహక జాబితాకు ఎంపిక చేసింది.
నాలుగేళ్లలో 500 ప్రైవేట్ అకాడమీలకు చేయూత
రానున్న నాలుగేళ్లలో 500 ప్రైవేటు అకాడమీలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆర్థిక ప్రోత్సాహం అందించనుంది. దేశవ్యాప్తంగా మారుమూలనున్న ప్రతిభను వెలికితీయడానికే అకాడమీలకు ఆర్థిక సహాయం చేయనున్నట్లు క్రీడల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
నాలుగేళ్లలో 500 ప్రైవేట్ అకాడమీలకు చేయూత
క్రీడాకారుల ప్రదర్శన, శిక్షణ నాణ్యత, కోచ్‌ల స్థాయి, మౌలిక వసతుల ప్రమాణాలు, సిబ్బంది ప్రకారం అకాడమీల్ని వివిధ విభాగాల్లో ఎంపిక చేస్తారు. "దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి ప్రతిభావంతుల్ని వెలికి తీయడం కోసం అకాడమీలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం ముఖ్యం. చాలా అకాడమీలు క్రీడాకారులను గుర్తించి, శిక్షణ ఇస్తున్నాయి. వారిని ప్రోత్సహించడానికే ఈ పథకం" అని క్రీడల మంత్రి రిజిజు అన్నారు.