ప్రతిఏటా జరిగే అత్యున్నత క్రీడా పురస్కారాల ఎంపిక.. ఈసారి ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. అందుకోసం ఈ-మెయిల్ ద్వారా నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కేంద్రం తెలియజేసింది. లాక్డౌన్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఈ-మెయిల్ ద్వారా క్రీడా పురస్కారాల నామినేషన్లు
వివిధ క్రీడా పురస్కారాల నామినేషన్లను ఈమెయిల్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది కేంద్ర క్రీడల శాఖ. లాక్డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈమెయిల్ ద్వారా క్రీడా పురస్కారాల నామినేషన్లు
సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వాలి. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఓ నెల రోజులు వాయిదా పడింది. జూన్ 3న ఈ స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది.
ఆగస్టు 29న భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్బంగా వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన ఆటగాళ్లు, కోచ్‌లకు ఈ పురస్కారాల్నికేంద్రం అందజేయనుంది.