తెలంగాణ

telangana

ETV Bharat / sports

'క్రీడాకారులకు జీవితకాల పెన్షన్​ అందజేస్తాం'

జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు జీవితకాలం పెన్షన్​ అందజేస్తామని అన్నారు కేంద్ర క్రీడామంత్రి కిరణ్​రిజిజు. ఆటగాళ్లను ఆర్థికంగా ఆదుకోవటానికి కేంద్రం తగిన చర్యలు చేపడుతోందని రాజ్యసభలో ఆయన వెల్లడించారు.

Sports minister says lifelong pension being given to athletes
'క్రీడాకారులకు జీవితకాల పెన్షన్​ అందజేస్తాం'

By

Published : Feb 11, 2020, 10:19 AM IST

Updated : Feb 29, 2020, 11:09 PM IST

దేశంలోని క్రీడాకారులకు జీవితకాలం పెన్షన్​ అందిస్తామని క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజిజు.. పార్లమెంట్​ వేదికగా స్పష్టం చేశారు. క్రీడాకారుల మెరిటోరియస్ పెన్షన్​​ పథకంలో భాగంగా ప్రస్తుతం 627 మంది అథ్లెట్లు లబ్ధి పొందుతున్నారన్నారు. భారత్​ తరపున అంతర్జాతీయ, జాతీయ వేదికల్లో పతకాలు సాధించిన వారు.. ఈ పథకానికి అర్హులు అని చెప్పారు. అథ్లెట్ల రిటైర్మెంట్​ తర్వాతైనా, 30 ఏళ్ల దాటిన తర్వాతైనా పెన్షన్​ అందిచనున్నట్టు ఆయన వెల్లడించారు.

ఒలింపిక్స్​, కామన్వెల్త్, ఆసియా గేమ్స్​, ప్రపంచకప్​, ప్రపంచ ఛాంపియన్​షిప్​.. ఇలాంటి వేదికల్లో పతకాలు నెగ్గిన వారికి ప్రతినెలా రూ.12 నుంచి 20 వేల వరకు పెన్షన్​ అందుతుందన్నారు కిరణ్ రిజిజు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న మాజీ క్రీడాకారులకు సాయం చేసేందుకు, కేంద్రప్రభుత్వం ఎప్పుడు ముందుటుందని చెప్పారు.

ఇదీ చూడండి.. అప్పుడు మోసగాడిగా... ఇప్పుడు హీరోగా

Last Updated : Feb 29, 2020, 11:09 PM IST

ABOUT THE AUTHOR

...view details