కేంద్ర బడ్జెట్‌లో క్రీడలకు కేటాయించిన మొత్తాన్ని అవసరమైతే సవరిస్తామని క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే క్రీడాకారుల అవసరాలు తీరుస్తున్నామని చెప్పారు. సోమవారం నాటి బడ్జెట్‌లో ప్రభుత్వం క్రీడలకు రూ.2596.14 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోల్చుకుంటే రూ.230.78 కోట్లు కోత విధించింది.
'అవసరమైతే బడ్జెట్ కేటాయింపుల సవరణ' - Union Budget.
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో క్రీడలకు కేటాయించిన మొత్తంపై కోత విధించడంపై క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. అవసరమైతే కేటాయింపులను సవరించడానికి సిద్ధమని పేర్కొన్నారు.
!['అవసరమైతే బడ్జెట్ కేటాయింపుల సవరణ' Sports Minister Kiran Rijiju has reacted to the imposition of a cut on the amount allocated for sports in the Union Budget.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10492161-thumbnail-3x2-rijiju.jpg)
'అవసరమైతే బడ్జెట్ కేటాయింపులు సవరిస్తాం'
"అవసరమైతే కేటాయించిన మొత్తాన్ని సవరించేందుకు నిబంధన ఉంది. క్రీడాకారులు, జాతీయ క్రీడా సమాఖ్యల బాగోగులు చూసుకోడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఉంది. క్రీడాకారులకు కావాల్సిన నిధుల్లో కొరత లేదు. విదేశీ శిక్షణ, విదేశీ కోచ్‌ల నియామకంతో సహా అన్ని అవసరాల్ని తీరుస్తున్నాం" అని రిజిజు పేర్కొన్నారు.