మీ త్యాగం అమరం.. వీరజవాన్లకు క్రీడాకారుల నివాళి - సైనికుల మరణంపై క్రీడాకారులు ఘననివాళి
భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో 20మంది సైనికులు అమరులు కావడం దేశప్రజల్ని కలచివేసింది. దీనిపై ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడాకారులు సోషల్‌మీడియా ద్వారా సంతాపం తెలిపారు.
రజవాన్లకు క్రీడాకారుల నివాళి
తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో జూన్ 15 రాత్రి భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటనపై దేశ మొత్తం తీవ్ర ఆవేదనకు గురైంది. వీరమరణం పొందిన సైనికులకు ఘనంగా నివాళులర్పించారు దేశ ప్రజలు. ప్రముఖ సినీ, క్రీడాకారులు సోషల్‌మీడియా ద్వారా సంతాపం తెలిపారు. మీ త్యాగాలు మరువలేనివంటూ ట్వీట్లు చేశారు.