రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ)కు.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) కాగ్నిజెన్స్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం నోయిడా వేదికగా జరుగుతున్న రెజ్లింగ్ నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఆటగాళ్లు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమేల ఇందుకు కారణమని పేర్కొంది. సంబంధిత అంశంపై సోమవారం నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
"రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై వచ్చిన ఆరోపణల కారణంగా చర్యలకు ఉపక్రమించాం. ప్రతి ఒక్కరు కరోనా మార్గదర్శకాలు పాటించాల్సిన అవసరం ఉంది. సదరు ఘటనపై రెజ్లింగ్ సమాఖ్య నుంచి నివేదిక కోరాం.
-సందీప్ ప్రధాన్, సాయ్ డైరెక్టర్ జనరల్