తెలంగాణ

telangana

ETV Bharat / sports

చివరి మెట్టుపై సింధూ బోల్తా.. స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్‌లో ఓటమి - స్పెయిన్​ మాస్టర్స్ ఫైనల్స్​లో పీవీ సింధూ

ఆదివారం జరిగిన స్పెయిన్​ మాస్టర్స్ టోర్నీలో భారత్​కు చేదు అనుభవం ఎదురయ్యింది. స్టార్​ షట్లర్​ పీవీ సింధు ఫైనల్‌ మ్యాచ్​లో ఓటమిని మూటగట్టుకుని వెనుతిరిగింది. ఇండోనేషియాకు చెందిన టుంజుంగ్‌ చేతిలో 8-21, 8-21 తేడాతో సింధు ఓటమిని చవి చూసింది.

pv sindhu
pv sindhu

By

Published : Apr 2, 2023, 6:57 PM IST

Updated : Apr 2, 2023, 8:19 PM IST

ఆదివారం జరిగిన స్పెయిన్​ మాస్టర్స్ టోర్నీలో భారత్​కు చేదు అనుభవం ఎదురయ్యింది. స్టార్​ షట్లర్​ పీవీ సింధు ఫైనల్‌ మ్యాచ్​లో ఓటమిని మూటగట్టుకుని వెనుతిరిగింది. ఇండోనేషియాకు చెందిన టుంజుంగ్‌ చేతిలో 8-21, 8-21 తేడాతో సింధు ఓటమిని చవి చూసింది.

2022 ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్​ను సొంతం చేసుకున్న ఇండోనేషియాన్​ మాజీ జూనియర్ ప్రపంచ ఛాంపియన్ టుంజంగ్ ముందు సింధూ నిలవలేకపోయింది. ప్రారంభంలోనే ఇండోనేషియా ప్లేయర్​ 5-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే సింధూ కమ్​ బ్యాక్​ ఇవ్వడానికి ప్రయత్నించి 5-7 స్కోర్​ వరకు బాగా ఆడింది. అయితే కొద్దిసేపటికే, ఇండోనేషియా ప్లేయర్​ అద్భుతమైన షాట్లతో చెలరేగి 19-6తో స్పష్టమైన ఆధిక్యానికి చేరుకుంది. ఇక రెండో గేమ్‌లో తొలుత వెనుకబడిన టుంజంగ్ కాసేపటికే 11-3 భారీ ఆధిక్యంతో విజయానికి దగ్గరకు చేరుకుంది. ఆఖరికి 8-21 తేడాతో సింధూ ఓటమిని చవి చూసింది.

కాగా శనివారం జరిగిన సెమీ ఫైనల్స్​లో సింగపూర్​ ప్లేయర్​ యెజియా మిన్‌పై సింధూ విజయం సాధించింది. గాయం కారణంగా సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న సింధూ.. మ్యాచ్​లు ఆడుతూ తిరిగి ఫామ్​లోకి రావడానికి కష్టపడుతోంది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సింధూకు.. ఈ విజయం ఉత్సాహాన్ని ఇస్తుందని భావించినప్పటికీ నిరాశే ఎదురయ్యింది. 2016 నవంబర్​ నుంచి టాప్​ 10 లిస్టులో రాణించిన సింధూ.. మొదటిసారిగా ఆ జాబితా నుంచి నుంచి నిష్క్రమించింది. ఇక, మార్చి ఆరంభంలో జరిగిన ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్​షిప్​ నుంచి మొదటి రౌండ్​లోనే బయటకు వచ్చేసింది. ఆ తర్వాత జరిగిన స్విస్​ ఓపెన్ సూపర్​ 300​లోనూ టైటిల్​ను​ చేజార్చుకుంది. అంతకుముందు జనవరిలో జరిగిన ఇండియన్​ ఓపెన్​, మలేసియా ఓపెన్​లో మొదటి రౌండ్​లోనే నిష్క్రమించిది.

కొత్త కోచ్​తో కోచింగ్​..
ఈ ఏడాది ఫిబ్రవరిలో పీవీ సింధూ తన కోచ్ పార్క్ టే సాంగ్​తో విడిపోయిన తర్వాత విధి చౌదరీ ట్రైనింగ్​లో శిక్షణ తీసుకుంటోంది. నాలుగేళ్ల పాటు పార్క్ కోచింగ్​లో శిక్షణ పొందిన సింధూ ఇటీవలే ఆయనతో మనస్పర్థల వల్ల విడిపోయింది. సింధు నిర్ణయాన్ని గౌరవిస్తూ తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు కోచ్​ చెప్పాడు. కాగా, 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి పార్క్ టే సాంగ్ - పీవీ సింధూ ప్రయాణం మొదలైంది. మొదట్లో అతడిని మెన్స్ సింగిల్స్ కోచ్​గా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించినప్పటికీ.. తర్వాత సింధు పర్సనల్​ కోచ్​గా మారాడు. ఇక పార్క్ కోచింగ్ శిక్షణలో సింధూ ప్రపంచ ఛాంపియన్‌షిప్​లో స్వర్ణం, టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకంతో పాటు కామన్వెల్త్ గేమ్స్​లో గోల్డ్​ మెడల్​ను సొంతం చేసుకుంది.

Last Updated : Apr 2, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details