తెలంగాణ

telangana

ETV Bharat / sports

1500 మీటర్ల పరుగులో భారత్​కు ​ 4 మెడల్స్​

నేపాల్​ వేదికగా జరుగుతోన్న 13వ దక్షిణాసియా క్రీడల్లో భారత్​ హవా కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పలు పోటీల్లో భారత బృందం నాలుగు పతకాలు సాధించింది. ఇందులో ఓ స్వర్ణం, రెండు రజతాలు, ఓ కాంస్యం లభించింది.

Indian athletes win 4 medals in 1500m races of SAG
దక్షిణాసియా క్రీడల్లో భారత్​కు 4 పతకాలు

By

Published : Dec 3, 2019, 3:52 PM IST

దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. నేపాల్​లోని ఖాట్​మాండు​ వేదికగా జరిగిన రెండో రోజు పోటీల్లో... భారత అథ్లెట్లు నాలుగు పతకాలు కైవసం చేసుకున్నారు.

స్వర్ణంతో సత్తా...

పురుషుల విభాగంలో జరిగిన 1500 మీటర్ల పరుగు పందేంలో భారత అథ్లెట్​ అజయ్‌ కుమార్‌ సారో స్వర్ణం సాధించాడు. పరుగును 3.54.18 సెకన్లలో పూర్తి చేశాడు. మరో భారత్​ అథ్లెట్​ అజీత్‌ కుమార్‌ 3.57.18 సెకన్లతో రజతం గెలిచాడు. ఇందులో నేపాల్‌ అథ్లెట్‌ టంకా కార్కి (3.50.20 సెకన్లు) కాంస్యం అందుకున్నాడు.

మహిళలు రెండు...

మహిళల 1500 మీటర్ల పరుగులో భారత క్రీడాకారిణి చందా (4.34.51 సెకన్లు) రజతం, మరో అథ్లెట్​ చిత్రా పలకీజ్‌ (4.35.46 సెకన్లు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. శ్రీలంక అమ్మాయి ఉడా కుబురలగె (4.34.34 సెకన్లు) పసిడి అందుకుంది.

ప్రస్తుతం భారత్‌ 21 పతకాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 6 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలు సాధించింది. క్రీడలకు ఆతిథ్యమిస్తున్న నేపాల్‌ 28 పతకాలో అగ్రస్థానంలో ఉంది. ఈ పోటీలు డిసెంబర్​ 1 నుంచి 10 వరకు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details