తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాసియా క్రీడల్లో భారత్​ బోణీ.. ఒకే రోజు 4 పతకాలు - triathlon india

దక్షిణాసియా క్రీడల్లో(శాగ్​) ఓ స్వర్ణం, రెండు రజతాలు, ఓ కాంస్యంతో భారత్ బోణీ కొట్టింది. ట్రైథ్లాన్ ఈవెంట్​లో ఎమ్​ఎన్ సినిమోల్ అగ్రస్థానంలో నిలిచి.. దేశానికి తొలి స్వర్ణాన్ని అందించాడు.

South Asian Games: India opens medal account with 1 gold, 2 silver, 1 bronze in triathlon
దక్షిణాసియా క్రీడలు

By

Published : Dec 2, 2019, 5:02 PM IST

నేపాల్​లో సోమవారం ఘనంగా ప్రారంభమైన దక్షిణాసియా క్రీడల్లో(శాగ్​) భారత్ శుభారంభం చేసింది. తొలిరోజు ఓ స్వర్ణం, రెండు రజతాలు సహా ఓ కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ నాలుగు పతకాలు ఒకే ఈవెంట్​లో రావడం విశేషం.

ట్రైథ్లాన్​(మూడు క్రీడలు కలిపి) ఈవెంట్ పురుషుల విభాగంలో ఎమ్​.ఎన్ సినిమోల్.. భారత్​కు తొలి స్వర్ణాన్ని అందించాడు. ఇదే విభాగంలో రెండో స్థానంలో నిలిచిన బిశ్వర్జీత్​ శ్రీఖోమ్ రజతాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళా విభాగంలో సరోజిని దేవి.. రజతం, మోహన్ ప్రజ్ఞ్యా.. కాంస్యం దక్కించుకున్నారు.

ట్రైథ్లాన్ ఈవెంట్ అంటే?

ట్రైథ్లాన్​లో ముఖ్యంగా మూడు పోటీలు ఉంటాయి. 750 మీటర్ల స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల బైక్ రేసింగ్, 5 కి.మీ పరుగు పందెం నిర్వహిస్తారు. ఒకదాని తర్వాత ఒకటి మూడు పోటీల్ని పూర్తి చేయాలి.

సినిమోల్.. గంట 2 నిమిషాల 51 సెకన్లులో ఈ ఈవెంట్​ను పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచాడు. బిశ్వర్జీత్.. గంట 2 నిమిషాల 59 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. నేపాల్​కు చెందిన బసంతా తరు మూడో స్థానంతో సరిపెట్టుకొని కాంస్యం సొంతం చేసుకున్నాడు.

మహిళల వ్యక్తిగత విభాగంలో సరోజిని.. గంట 14 నిమిషాల సమయంలో ఈ ఈవెంట్​ను పూర్తి చేసింది. ప్రజ్ఞ్యా.. గంట 14 నిమిషాల 57 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. నేపాల్​కు చెందిన సోనీ గురుంగ్.. గంట 13 నిమిషాల 45 సెకన్లతో పసిడి కైవసం చేసుకుంది.

దక్షిణాసియా క్రీడల్లోభారత్​ నుంచి 15 విభాగాల్లో 487 అథ్లెట్లు పోటీపడుతున్నారు. ప్రస్తుతం ఆరు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యం సహా 9 మెడల్స్​తో పతకాల పట్టికలో నేపాల్ అగ్రస్థానంలో ఉంది.

ఇదీ చదవండి: ఘనంగా రెజ్లర్ బబిత వివాహం.. హాజరైన ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details