జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు ఎస్‌ఎఫ్‌ఆర్ స్నేహిత్ పతకం ఖాయం చేశాడు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో అడుగుపెట్టిన ఈ 20 ఏళ్ల ఆటగాడు కనీసం కాంస్యం సాధించే అవకాశం కొట్టేశాడు. సోమవారం క్వార్టర్స్‌లో అతను 4-1 (8-11, 12-10, 11-9, 11-8, 11-3) తేడాతో సుష్మిత్ శ్రీరాం (టీటీఎఫ్‌ఐ)పై విజయం సాధించాడు.
ఆరో సీడ్‌తో మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఓడినప్పటికీ.. తిరిగి బలంగా పుంజుకున్న స్నేహిత్ అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లోనూ కీలక సమయంలో ఆధిపత్యం ప్రదర్శించి పైచేయి సాధించాడు. ఇక మూడు, నాలుగు గేమ్‌ల్లో అదే జోరు కొనసాగించి 3-1తో విజయం ఖరారు చేసుకున్నాడు. అయిదో గేమ్‌లో చెలరేగి ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి ఘనంగా మ్యాచ్‌ను ముగించాడు.