తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​ టార్చ్​ రిలేను కలవరపెడుతున్న కరోనా - Tokyo Olympic torch relay corona cases

టోక్యో ఒలింపిక్స్​ టార్చ్​ రిలేలో విధులు నిర్వహిస్తున్న మరో ఆరుగురికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఒలింపిక్స్​ నిర్వాహకులు తెలిపారు.

Tokyo Olympic torch
ఒలింపిక్స్​ టార్చ్​ రిలే

By

Published : May 2, 2021, 3:46 PM IST

టోక్యో ఒలింపిక్స్​ టార్చ్​ రిలేలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ జ్యోతి యాత్ర కార్యకలాపాల్లో పాల్గొన్న మరో ఆరుగురికి వైరస్​ సోకింది. దీంతో బాధితుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ విషయాన్ని ఒలింపిక్స్​ నిర్వాహకులు తెలిపారు. వీరందరూ మాస్కులు ధరించడం సహా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, మహమ్మారి బారిన పడ్డారని వెల్లడించారు. ప్రతిఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఒలింపిక్స్​పై రోజుకో మాట

కరోనా మహమ్మారి పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై రోజుకో మాట వినిపిస్తోంది. కొందరు అధికారులు జరుగుతుందని, మరికొందరు రద్దు అవుతుందని అంటున్నారు. టోక్యో వేదికగా ఒలింపిక్స్​.. గత ఏడాదిలోనే జరగాలి. కరోనా కారణంగా ఈ సంవత్సరం జులై 23కి వాయిదా పడ్డాయి. మరి ఈసారైనా జరుగుతాయో లేదో?

ఇదీ చూడండి:'కరోనా విజృంభిస్తే ఒలింపిక్స్​ రద్దు!'

ABOUT THE AUTHOR

...view details