తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టార్ బాక్సర్ మేరీకోమ్​కు మరో అత్యున్నత గౌరవం

ప్రముఖ బాక్సర్​ మేరీకోమ్​ పేరు చివరన 'ఒలి' అనే పదాన్ని చేర్చుతూ ప్రపంచ ఒలింపిక్ అసోసియేషన్​ నిర్ణయం తీసుకుంది. ఆ ఫొటోను మేరీ తన ట్విట్టర్​లో పంచుకుంది.

స్టార్ బాక్సర్ మేరీకోమ్​

By

Published : Nov 8, 2019, 6:01 AM IST

Updated : Nov 8, 2019, 7:10 AM IST

భారత స్టార్ బాక్సర్​ మేరీకోమ్ మరో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఆరుసార్లు ఒలింపిక్ ఛాంపియన్​గా నిలిచిన ఈమె పేరు చివరన 'ఒలి' అనే పదాన్ని చేర్చింది ప్రపంచ ఒలింపియన్స్​ అసోసియేషన్. సంబంధిత ఫొటోను ట్విట్టర్​లో పంచుకుంది మేరీ. తనకు అవకాశం ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసింది.

సమాజంలో ఓ ఒలింపియన్​గా, ఒలింపిక్​ క్రీడల విలువలను ప్రచారం చేసే క్రీడాకారులకు కొందరికి.. తమ పేరు చివరన 'ఒలి' అనే పదాన్ని జత చేస్తారు. 2017 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఈ పదాన్ని తమ పేరు చివర డిగ్రీలా క్రీడాకారులు ఉంచుకోవచ్చు. ధ్రువపత్రాల్లోనూ రాసుకోవచ్చు.

గతేడాది జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో కాంస్య పతకం సాధించింది మేరీకోమ్. సెమీఫైనల్లో టర్కీకి చెందిన బుసనెజ్​ చేతిలో ఓడిపోయింది.

మేరీకోమ్.. ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో ఎనిమిది పతకాలు సాధించిన ఏకైక బాక్సర్.

ఇది చదవండి: అథ్లెట్ అంబాసిడర్ గ్రూపులో మేరీకోమ్

Last Updated : Nov 8, 2019, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details