Asia Badminton Championship Pv Sindhu: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీసింధు మరో అడుగు ముందుకేసింది. గురువారం జరిగిన పోటీల్లో గెలిచి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
మహిళల సింగిల్స్‌లో సింగపూర్‌కు చెందిన యు యన్ జస్లిన్(Yue Yann Jaslyn Hooi) 21-16, 21-16 తేడాతో ఓడించింది. ఈ పోరు 42 నిమిషాల పాటు సాగింది. క్వార్టర్స్‌లో టోక్యో ఓలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన మూడో సీడ్ హె బింగ్‌తో(He Bing Jiao) తలపడనుంది.