Swiss Open 2022: రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, ప్రపంచ ఛాంపియన్ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్.. మరో టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మంగళవారం(మార్చి 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగాఈవెంట్తోనైనా తమ టైటిళ్ల కరవుకు తెరదించాలని వీరిద్దరూ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు.. జర్మన్ ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన లక్ష్యసేన్ ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. కాగా, గత రెండు వారాల్లో జరిగిన జర్మన్ ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో స్టార్ షట్లర్లు సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్‌కు కూడా చేరుకోలేకపోయారు.
మహిళ సింగిల్స్ మొదటి రౌండ్లో సింధు.. డెన్మార్క్‌కు చెందిన లైన్ హెజ్మార్క్తో తలపడనుండగా.. మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చైనాకు చెందిన ఏడో సీడ్ వాంగ్ జీ యీతో ఆడనుంది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరి ఓటమి పాలైన గాయత్రి గోపీచంద్ పుల్లెల, జోలీ జోడీ తమ మొదటి రౌండ్లో థాయ్‌లాండ్‌కు చెందిన జోంగ్కొల్పాన్, రవింద ప్రజాంగజై ద్వయాన్ని ఎదుర్కోనున్నారు.