Sindhu Singapore Open: అద్భుత ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు.. సింగపూర్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీస్‌లో జపాన్ షట్లర్ సయెనా కవాకమీని చిత్తు చేసింది. 21-15, 21-7 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్ 32 నిమిషాల్లోనే ముగియడం విశేషం.
ఫైనల్లో పీవీ సింధు.. జపాన్ షట్లర్‌ను చిత్తుచిత్తుగా ఓడించి.. - సింధు దూకుడు
Sindhu Singapore Open: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టి.. మరో టైటిల్‌పై కన్నేసింది.
Sindhu sails into Singapore final
2022 సీజన్లో తొలి సూపర్ 500 టైటిల్‌ను చేజిక్కించుకునేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది సింధు. ఈ ఏడాది.. రెండు సూపర్ 300 టైటిళ్లు గెల్చుకుంది భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఇందులో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ ఉన్నాయి.