Singapore badminton open 2022: సింగపూర్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సత్తా చాటారు. గురువారం జరిగిన మ్యాచ్‌లో వీరు విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. వియత్నాంకు చెందిన థయ్ లిన్హ్‌తో తలపడిన సింధూ.. 19-21, 21-19, 21-18 పాయింట్ల తేడాతో గెలిచింది. క్వార్టర్స్‌లో చైనాకు చెందిన హన్ యూను ఎదుర్కోనుంది.
సింగపూర్ ఓపెన్‌లో సత్తా చాటిన సింధు, ప్రణయ్.. క్వార్టర్స్‌లోకి ఎంట్రీ - సింగపూర్ ఓపెన్
PV Sindhu: సింగపూర్ ఓపెన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచుల్లో షట్లర్లు పీవీ సింధు, ప్రణయ్ విజయం సాధించారు. వీరిద్దరూ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. సింధు.. వియత్నాంకు చెందిన థయ్ లిన్హ్పై గెలుపొందగా.. తైవాన్‌కు చెందిన చౌ టైన్పై ప్రణయ్ విజయం సాధించాడు.
సింధు
మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్న తైవాన్‌కు చెందిన చౌ టైన్‌తో తలపడిన ప్రణయ్.. ప్రత్యర్థిపై విజయం సాధించాడు. గంటా తొమ్మిది నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 14-21, 22-20, 21-18 పాయింట్ల తేడాతో గెలుపొందాడు.
ఇదీ చూడండి :కేఎల్ రాహుల్‌తో పెళ్లి.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్