మలేసియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్ చేతిలో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 13-21, 21-15, 21-13 తేడాతో రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సింధు ఓటమిపాలైంది. దీంతో సింధుపై తన ఆధిపత్యాన్ని అలాగే కొనసాగించింది తై జు.
మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ నెం.8 జొనాథన్ క్రిస్టీతో తలపడనున్నాడు భారత థామస్ కప్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్.
మళ్లీ ప్రత్యర్థిదే పైచేయి.. మలేసియా ఓపెన్ నుంచి సింధు ఔట్ - పీవీ సింధు
మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ నుంచి వైదొలిగింది రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు. కౌలాలంపూర్ వేదికగా శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్ చేతిలో సింధు ఓటమిపాలైంది.
pv sindhu malaysia open