Thaliand Open: థాయ్లాండ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. బ్యాంకాక్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యు ఫెయి చేతిలో వరుస సెట్లలో ఓడిపోయింది. 43 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సింధు.. మూడో సీడ్ చెన్ చేతిలో 17-21, 16-21 తేడాతో ఓటమిపాలైంది.
Thaliand Open: సెమీస్లో సింధు ఓటమి.. టోర్నీ నుంచి ఔట్
Thaliand Open: థాయ్లాండ్ ఓపెన్ సెమీస్లో నిరాశపరిచింది స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ప్రపంచ నెం.4, చైనాకు చెందిన చెన్ యు ఫెయి చేతిలో వరుస సెట్లలో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది.
PV Sindhu news
చివరిసారిగా 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో కూడా చెన్ చేతిలో ఓడింది 26 ఏళ్ల సింధు. ఈ సీజన్లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్లో రెండు సూపర్ 300 టైటిల్స్ గెలిచింది సింధు. తదుపరి జూన్ 7 నుంచి 12 వరకు జకార్తాలో జరిగే ఇండోనేషియా మాస్టర్స్ 500లో పోటీపడనుంది.
ఇదీ చూడండి:భర్త ప్రోత్సాహం.. ఆమె పట్టుదల.. జాతీయ ఛాంపియన్గా ఎదిగి